విష జ్వరాలు రాకుండా చర్యలు తీసుకోవాలి

6 Aug, 2016 00:27 IST|Sakshi
  • l ఆరోగ్యశాఖ సిబ్బందికి ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆదేశాలు
  • ఎంజీఎం : జిల్లాలో మలేరియా, డెంగీ వ్యాధి కేసులు గుర్తించి, తగిన చికిత్స అందించాలని వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాజేశ్వర్‌ తివారీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులను ఆదేశించారని డీఎంహెచ్‌ఓ సాంబశివరావు తెలిపారు.
     
    శుక్రవారం మధ్యాహ్నాం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆయా జిల్లాల వైద్యశాఖ సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. కలుషిత నీటి వల్ల వ్యాధుల రాకుండా చర్యలు తీసుకోవాలని, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగాలతో సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ శ్రీరాం, డీఐఓ హరీశ్‌రాజు, జబ్బార్, కోఆర్డినేటర్‌ శ్యామ నీరజ, ఐడీఎస్‌పీ కృష్ణారావు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు