మహిళల భద్రతకు పటిష్ట చర్యలు

12 Dec, 2016 14:55 IST|Sakshi
మహిళల భద్రతకు పటిష్ట చర్యలు

ఆదిలాబాద్,ఉట్నూర్‌లలో షీటీంలు
  ఎస్పీ శ్రీనివాస్

ఆదిలాబాద్ క్రైం : జిల్లాలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తామని ఎస్పీ ఎం.శ్రీనివాస్ పేర్కొన్నారు.మంగళవారం తన కార్యాలయంలో షీ టీం బృందాలతో సమావేశమయ్యారు. షీటీంల బ్యానర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు వ్యవస్థలో ఆర్థిక నేరాలను అరికట్టడంతో పాటు మహిళల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నూతనంగా ఆదిలాబాద్‌లో రెండు, ఉట్నూర్‌లో ఒక షీటీంలు ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల 8మంది మహిళాపోలీసులతో పాటు నలుగురు కానిస్టేబుళ్లకు హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ శిక్షణ కేంద్రంలో రెండు వారాలు శిక్ష ణ ఇచ్చినట్లు వివరించారు. త్వరలో స్థానికపోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో షీటీం సభ్యులకు కరాటే శిక్షణ ఇస్తామన్నారు. నేరాలకు సంబంధించిన ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తుగా నియంత్రించడానికి పనిచేయాలని సూచించారు.

సీసీఎస్ డీఎస్పీ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో రోజువారీ కార్యక్రమాల నిర్వహణ ఉంటుందన్నారు. మహిళలు నిర్భయంగా ఉండాలని, ఎలాంటి సమస్యలున్నా డయల్ 100, ఉమెన్స్ హెల్ప్‌లైన్ 1091కు సమాచారం అందించి రక్షణ పొందాలన్నారు. కాలేజ్, బస్టాం డ్, పార్కులు, సినిమాహాల్స్, రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాల్లో నిఘా ఉంచాలని పేర్కొన్నారు. గురువారం షీటీం బృంధాలకు నూతన యాక్టివ వాహనాలు అంది స్తామన్నారు. మహిళల రక్షణ కోసం షీటీంలు నిరంతరం కృషి చేయాలన్నారు. సీసీఎస్ డీఎస్పీ నర్సింహారెడ్డి, షీటీం సభ్యులు సర్దార్‌సింగ్, ఎం.రాధ, రామ్మూర్తి, లక్ష్మి, శంకర్, మౌనిక, సరిత, శ్రీనివాస్, అనిత, సుశీల, సుగుణ, సీసీ పోతరాజు ఉన్నారు.

మరిన్ని వార్తలు