తాత్కాలిక డీఎంహెచ్‌వోగా మీనాక్షి మహదేవ్

1 Jan, 2017 23:40 IST|Sakshi

కర్నూలు(హాస్పిటల్‌): తాత్కాలిక డీఎంహెచ్‌వోగా డాక్టర్‌ మీనాక్షి మహదేవ్‌ను నియమిస్తూ జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆదివారం డాక్టర్‌ మీనాక్షి మహదేవ్‌ బాధ్యతలు స్వీకరించారు. డీఎంహెచ్‌వోగా ఉన్న డాక్టర్‌ యు.స్వరాజ్యలక్ష్మి దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. ఇదే సమయంలో అడిషనల్‌ డీఎంహెచ్‌వోగా పనిచేస్తున్న డాక్టర్‌ రాజాసుబ్బారావు సైతం డిసెంబర్‌  31వ తేదీన పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో ప్రాంతీయ శిక్షణా కేంద్రం(మేల్‌)లో ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ వై.నరసింహులును ఇన్‌ఛార్జిగా నియమించారు. అయితే ఆయన తన తల్లి ఆరోగ్యం బాగాలేదని బాధ్యతలు తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో డీఎంహెచ్‌వోతో పాటు అడిషనల్‌ డీఎంహెచ్‌వో పోస్టు ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన ఉన్న సందర్భంగా సీనియర్‌గా ఉన్న ప్రాంతీయ శిక్షణ  కేంద్రం(ఫిమేల్‌) ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మీనాక్షిమహదేవ్‌ను తాత్కాలిక డీఎంహెచ్‌వోగా నియమించారు. ఆమెను ఆదివారం ఏపీ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం నాయకులు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 

మరిన్ని వార్తలు