-

గొలుసుల దొంగ అరెస్టు

5 May, 2017 23:50 IST|Sakshi
రూ.6.5 లక్షల చోరీసొత్తు స్వాధీనం
 
యానాం : 
నిర్జనప్రదేశాన్ని ఎన్నుకుంటాడు. ఒంటరిగా వెళుతున్న మహిళలను వెంబడిస్తాడు.. అంతే క్షణంలో మెడలోని బంగారు గొలుసులు అపహరించి ఉడాయిస్తాడు. యానాంలోని వివిధ ప్రదేశాల్లో కొన్నేళ్లుగా బంగారు గొలుసులు దొంగిలిస్తూ తప్పించుకు తిరుగుతున్న దొంగను యానాం పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌చేశారు. యానాం ఎస్పీ నితి¯ŒS గౌహల్‌ శుక్రవారం ఈ ఘటనకు సంబంధించి వివరాలును విలేకరులకు వివరించారు. యానాంలోని కనకాలపేటలోని ఆదిఆంధ్ర పేటకు చెందిన మందపల్లి రాంబాబు అలియాస్‌ రమేష్‌ (29) 2014 నుంచి సుమారు 7 బంగారు నగల దొంగతనాల కేసుల్లో నిందితుడిగా వున్నాడు. శుక్రవారం అతనిని యానాంలోని త్యాగరాయవీధిలోని భవానిబ్యాంకర్స్‌ ఎదురుగా  తచ్చాడుతుండగా ఎస్సై శివకుమార్, క్రైమ్‌పార్టీ అరెస్ట్‌చేసి, అతని వద్దనుంచి రూ.6.5 లక్షల విలువచేసే 210.57గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. యానాంలోని బెజవాడాగార్డె¯Œ్స, కురసాంపేట, యూకేవీ నగర్, గణపతినగర్, హనుమా¯ŒS డాబా, కనకాలపేట, సుభద్రనగర్‌ ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్తున్న మహిళలను వెంబడించి వారిమెడలోని విలువైన బంగారు ఆభరణాలను తెంచి పారిపోతుంటాడు. నాలుగేళ్లుగా అతడు దొంగిలించిన వాటిలో ఎక్కువగా మంగళసూత్రాలు, గొలుసులు తదితరమైనవి వున్నాయి. తాము స్వాధీనం చేసుకున్న బంగారాన్ని బాధితులకు అందజేస్తామని పోలీసులు తెలిపారు. రాంబాబు గతంలో మల్లాడి సత్తిబాబు అనే వ్యక్తి వద్ద కారుడ్రైవర్‌గా పనిచేసేవాడని అతని వద్ద కూడా ఈ విధంగానే బంగారాన్ని దొంగిలించాడని తెలిపారు. నిందితుడ్ని పట్టుకోవడంలో కృషిచేసిన ఎస్‌ఐ శివకుమార్‌ను, కానిస్టేబుళ్లు సతీష్, దుర్గారావు, ప్రతాప్‌లను ఎస్పీ అభినందించారు.
 
మరిన్ని వార్తలు