మీనం.. మృత్యుతీరం

12 Feb, 2017 00:16 IST|Sakshi
మీనం.. మృత్యుతీరం
నరసాపురం రూరల్‌ :  జిల్లాలోని తీర ప్రాంతం మృత్యు చేపలతో నిండిపోతోంది. భారీ సంఖ్యలో చేపలు కొట్టుకువస్తున్నాయి. కొద్దిరోజుల కిందట చెన్నై సమీపంలో రెండు నౌకలు ఢీ కొనడంతో చమురు భారీగా సముద్రంలో కలవడంతో జలాలు కలుషితమయ్యాయి. చమురు ప్రభావానికి సముద్రంలోని చేపలు భారీగా చనిపోయి కొట్టుకువస్తున్నాయి. నాలుగు రోజుల కిందట డాల్ఫిన్‌ లు, తాబేళ్లు కొట్టుకురాగా శనివారం భారీసంఖ్యలో చేపలు కొట్టుకొచ్చాయి. 
అంతేకాకుండా శనివారం మత్స్యకారుల ఐలు వలకు టన్నుల కొద్దీ మత్స్యసంపద చిక్కడం స్థానికంగా చర్చనీయాంశమైంది. వీటిలో ఎక్కువ శాతం జెల్ల, గొరక జాతులకు చెందిన చేపలు ఉన్నట్టు మత్స్యకారులు తెలిపారు. వేములదీవి పెద్ద ఐలు వలకు చిక్కిన చేపలను రూ.1.5 లక్షలకు, మరో వలకు చిక్కిన చేపలను రూ.90 వేలకు విక్రయించారు. వీటిని కేవలం ఫీడ్‌ తయారీకి ఉపయోగిస్తారని తెలిపారు. కొట్టుకొచ్చిన చేపలతో తీరంలో దుర్వాసన వెదజల్లుతోంది.               
 
మరిన్ని వార్తలు