మధ్యాహ్నభోజనం ట్రస్టులకిస్తే చూస్తూ ఊరుకోం

22 Jul, 2016 17:19 IST|Sakshi
మధ్యాహ్నభోజనం ట్రస్టులకిస్తే చూస్తూ ఊరుకోం

స్వచ్ఛంద సంస్థలకు అప్పగిస్తే సహించేదిలేదు
మధ్యాహ్న భోజనం ఏజెన్సీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమ


పరిగి: మధ్యాహ్న భోజనం వడ్డించే బాధ్యతలు స్వచ్ఛంద సంస్థలు,  ట్రాస్టులకు అప్పగించాలనే ఆలోచన ప్రభుత్వం మానుకోవాలని మధ్యాహ్న భోజనం ఏజెన్సీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమ అన్నారు. శుక్రవారం ఆ సంఘం ఆధ్వర్యంలో పరిగిలో జీపుజాత నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం మధ్యాహ్నం ఏజెన్సీల నోట్లో మట్టికొడుతూ  పాఠశాలలల్లో మధ్యాహ్న భోజనం నిర్వహించే బాధ్యతలు స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చే కుట్ర చేస్తుందని పేర్కొన్నారు. ఫైలెట్‌ ప్రాజుక్టు కింద జిల్లాను ఎంచుకుని త్వరలో స్వచ్ఛంద సంస్థల చేత నిర్వహించే ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఎన్నో సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో కార్మికులు ఏజెన్సీలను నిర్వహిస్తున్నారని వారు తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత ఉండటం లేదని కాగ్‌ ఇప్పటికే నివేదిక ఇచ్చిందని ఆమె గుర్తు చేశారు. ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకువెళ్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజనం ఏజెన్సీల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నిర్మల,  సీఐటీయూ   జిల్లా కార్యదర్శి వెంకటేష్‌, నియోజకవర్గ కార్యదర్శి వెంకటయ్య, నాయకులు యాదగిరి, మంగమ్మ, నర్సమ్మ, సత్యమ్మ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు