క్షీర సమరం ప్రారంభం

16 Dec, 2016 00:12 IST|Sakshi
  • మండపేటలో మొదలైన రాష్ట్ర స్థాయి పాల, ప్రదర్శన పోటీలు 
  • ప్రారంభించిన ఎమ్మెల్యే వేగుళ్ల
  • వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన పాడిపశువులు
  • మండపేట :
    మండపేటలో క్షీర సమరం మొదలైంది. పెద్ద ఎత్తున తరలివచ్చిన పాడి పశువులతో మారేడుబాక రోడ్డులో పోటీల ఆవరణలో సందడి నెలకొంది. మూడురోజుల పాటు జరుగనున్న రాష్ట్రస్థాయి పాల, ప్రదర్శన పోటీలను మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు గురువారం ప్రారంభించారు. ఐదు విభాగాల్లో జరిగే ఆయా పోటీల్లో పాల్గోనేందుకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి పాడిరైతులు తమ పశువులను తీసుకువచ్చారు. రాష్ట్ర పశుసంవర్ధకశాఖ, పశుగణాభివృద్ధి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో పాలపోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ ఒంగోలు, పుంగనూరు తదితర జాతుల సంరక్షణకు, పాడిరైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. అందులో భాగంగా రూ.లక్షల వ్యయంతో పాలపోటీలను నిర్వహిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మ¯ŒS యాళ్ల దొరబాబు మాట్లాడుతూ మేలుజాతి పశుపోషణలో మండపేట ప్రాంత రైతులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుండటం అభినందనీయమన్నారు. 
    పోటీల్లో 211 పశువులు 
    పాల దిగుబడి, పశు ప్రదర్శనకు సంబంధించి నిర్వహిస్తున్న ఈ పోటీల్లో పాల్గొంనేందుకు ఉభయగోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, కృష్ణా, ప్రకాశం తదితర జిల్లాల నుంచి 211 పశువులు పోటీల్లో పాల్గొంటున్నాయి. పాలపోటీలకు సంబంధించి గేదెలకు సంబంధించి ముర్రా విభాగంలో 17, జాఫర్‌బాదిలో నాలుగు, ఆవులకు సంబంధించి ఒంగోలు విభాగంలో 17, గిర్‌లో ఆరు, పుంగనూరులో ఒక ఆవు పోటీలో నిలిచాయి. పశు ప్రదర్శన పోటీలకు సంబంధించి పోతుల విభాగంలో ముర్రా దున్నలు నాలుగు, ఒంగోలు గిత్తలు 22, గిర్‌ ఐదు, పుంగనూరు తొమ్మిది, పెయ్యిల విభాగంలో ముర్రా గేదెలు 25, ఒంగోలు ఆవులు 63, గిర్‌ 11, పుంగనూరు 25 ఆవులు పాల్గొంటున్నాయి. వీటిని తిలకించేందుకు మండపేట, పరిసర గ్రామాల నుంచి పాడిరైతులు, పశుపోషకులు, ఔత్సాహికులు తరలివస్తున్నారు. ఆయా పశువుల ప్రత్యేకతల గురించి సంబంధిత రైతులను అడిగి తెలుసుకుంటున్నారు. తమ ఉత్పత్తుల గురించి రైతులకు వివరించేందుకు మందుల తయారీ కంపెనీలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. పోటీల పర్యవేక్షణ కోసం 12 మంది ఏడీఏ స్థాయి అధికారులు, 50 మంది వెటర్నరీ అసిస్టెంట్లు, దాదాపు 80 మంది గోపాల మిత్రలను నియమించినట్టు అధికారులు తెలిపారు. 
    విజేత నిర్ణయం ఇలా..
    l పాల పోటీలు ప్రారంభోత్సవం సందర్భంగా గురువారం సాయంత్రం తీసిన పాలను నమూనాగా భావిస్తారు. శుక్రవారం రెండు పూటలు, శనివారం ఉదయం తీసిన పాలను లెక్కించి విజేతలను నిర్ణయిస్తారు. అదే రోజు సాయంత్రం బహుమతి ప్రదానోత్సవం నిర్వహిస్తారు.
    l శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటీ పాలకమండలి సభ్యులు పడాల సుబ్బారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మ¯ŒS నల్లమిల్లి వీర్రెడ్డి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కా ర్యదర్శి రెడ్డి రాధాకృష్ణ (రాజుబాబు), డీసీఎంఎస్‌ మాజీ చైర్మ¯ŒS రెడ్డి వీరవెంకటసత్యప్రసాద్, మండపేట పీఏసీఎస్‌ అధ్యక్షుడు మల్లిపూడి గణేశ్వరరావు, ఆలమూరు తాలుకా రైస్‌మిల్లర్స్‌ అసోసియేష¯ŒS అధ్యక్షుడు సీహెచ్‌వీవీ సత్యనారాయణమూర్తి, జేడీ వెంకటేశ్వర్లు, రాష్ట్ర పశుసంవర్ధక శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్‌ రమేష్‌బాబు, ఏడీఏలు విజయకుమారశర్మ, ఎం.రామకోటేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, మురళీ, ఉమామహేశ్వరరెడ్డి, కేంద్రీయ పశునమోదు పథకం జిల్లా స్టాక్‌మె¯ŒS పూర్ణచంద్రరావు, రైతులు పాల్గొన్నారు.
    ప్రత్యేక ఆకర్షణలు
    పోటీల సందర్భంగా కృష్ణాజిల్లాలోని వీరవల్ల నుంచి తీసుకువచ్చిన ఏడేళ్ల ముర్రా దున్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెండేళ్ల క్రితం రూ.12 లక్షలు వెచ్చించి హర్యానాలో ఈ దున్నను కొనుగోలు చేసినట్టు రైతు చిలకపాటి రాజీవ్‌ తెలిపారు. తన వద్ద ఈ తరహా దున్నలు 15 వరకు ఉన్నాయన్నారు. గుంటూరు జిల్లా నాదేండ్లకు చెందిన నల్లమోతు వేణుగోపాలరావుకు చెందిన ఒంగోలు గిత్తలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. కపిలేశ్వరపురం మండలం వడ్లమూరుకు చెందిన పాడిరైతు రిమ్మలపూడి గంగరాజు గిర్‌ ఆవులు, పలువురు పాడిరైతులకు చెందిన ముర్రా గేదెలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.           
     
మరిన్ని వార్తలు