చందాలు దండుకునేందుకే మినీ మహానాడ

25 May, 2017 19:49 IST|Sakshi
కొవ్వూరు : కొవ్వూరులో నిర్వహించిన టీడీపీ జిల్లా మినీ మహానాడు పేరుతో మంత్రి, నాయకులు భారీగా వ్యాపారుల నుంచి చందాలు దండుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి తానేటి వనిత విమర్శించారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మద్యం దుకాణాల నుంచి కిరాణా వర్తకుల వరకు చందాలు వసూలు చేయడం దుర్మార్గమైన చర్య అని ఆమె పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం లేకపోవడం మూలంగానే కొవ్వూరులో పెట్టిన జిల్లా మినీమహానాడు పూర్తిగా విఫలమైందన్నారు. నసమీకరణ కోసం ఉపాధి హామీ కూలీలకు మస్తర్‌ వేసి సభకు తరలించడం ఎంతవరకు సమజసం అని ప్రశ్నించారు. జిల్లాలో సమస్యలను గాలికి వదిలేసి మహానాడులో కేవలం ప్రతిపక్షంపై విమర్శలు చేయడానికే ప్రాధాన్యం ఇచ్చారన్నారు. చాగల్లు మండల పార్టీ అధ్యక్షుడు కోఠారు అశోక్‌బాబా, దళిత విభాగం రాష్ట్ర విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముప్పిడి విజయరావు, మండల పార్టీ అధ్యక్షుడు గురుజు బాల మురళీకృష్ణ (చిన్నారి), నాయకులు గారపాటి వెంకటకృష్ణ, ఉప్పులూరి సూరిబాబు, కొఠారు రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు