శ్రీ మఠానికి మినీ బస్సు విరాళం

18 Oct, 2016 23:43 IST|Sakshi
శ్రీ మఠానికి మినీ బస్సు విరాళం

మంత్రాలయం రూరల్‌:  రాఘవేంద్రస్వామి మఠానికి రూ.30 లక్షలు విలువ చేసే మినీ బస్సును విరాళంగా అందజేసినట్లు శ్రీమఠం మేనేజర్‌ శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. చెన్నైకి చెందిన రమేష్‌ అనే భక్తుడు బస్సును విరాళంగా అందజేశాడని, శ్రీ మఠం అవసరాలకు వినియోగిస్తామన్నారు. దాత కుటుంబసభ్యులకు శేషవస్త్రం, స్వామివారి మెమొం‍టో, ఫలమంత్రాక్షితలిచ్చి ఆశీర్వాదించారు.

మరిన్ని వార్తలు