కనీస పింఛను రూ.10వేలు ఇవ్వాలి

19 Jan, 2017 23:26 IST|Sakshi
కనీస పింఛను రూ.10వేలు ఇవ్వాలి
ఆల్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ మహాసభ డిమాండ్‌
కాకినాడ సిటీ : కనీస పింఛను రూ.10వేలు ఇవ్వాలని ఆల్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. గురువారం స్థ్ధానిక కొండయ్యపాలెంలోని జనవిజ్ఞాన వేదిక కార్యాలయంలో ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్‌స అసోసియేషన్‌ జిల్లా ప్రథమ మహాసభ హార్లిక్స్‌ పెన్షనర్స్‌ సంఘ నాయకులు సీహెచ్‌.మోహనరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మహాసభలో వివిధ అంశాలు, సమస్యలపై చర్చించిన అనంతరం వక్తలు మాట్లాడుతూ జీపీఎస్‌ విధానం రద్దు చేయాలని, సమస్యలపై పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పెన్షనర్ల సంఘాలు ఐక్యంగా పోరాటాలకు ముందుకురావాలని పిలుపునిచ్చారు. పీఎఫ్‌ఆర్‌yీ ఏ బిల్లు రద్దు చేయాలని, హెల్త్‌ కార్డులు ఇచ్చి వాటిపై అన్ని ఆస్పత్రుల్లో వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు.  అసోసియేషన్‌ జిల్లా కన్వీనర్‌ సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాము సూర్యారావు, జేవీవీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.స్టాలిన్, అధ్యక్షుడు కేఎంఎంఆర్‌ ప్రసాద్, జిల్లా ఉద్యోగ జేఏసీ అధ్యక్షులు బూరిగ ఆశీర్వాదం, ఎన్‌జీవో సంఘ మాజీ అధ్యక్షులు ఆచంట రామారాయుడు, వివిధ పెన్షనర్ల సంఘాల నాయకులు వీవీ కృష్ణమాచార్యులు, పీఎస్‌ఎస్‌ఎన్‌పీ శాస్త్రి, జి.అప్పారావు, ఏవీయూ సుబ్బారావు, బి.సత్యనారాయణ, సదానందమూర్తి పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు