'ఇకపై ఆన్‌లైన్‌లో ఏపీ ఎంసెట్'

18 Apr, 2016 18:39 IST|Sakshi
విజయవాడ : వచ్చే ఏడాది నుంచి ఎంసెట్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. అన్ని సెట్లు ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాల పరిశీలనకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం ఆయన ఎంసెట్ సమన్వయకర్తలు, విద్యా శాఖ ఉన్నతాధికారులతో ఎంసెట్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ నెల 29 వ తేదీన ఎంసెట్ కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, ఎక్కడా ఇబ్బందులు ఎదురుకాకూడదని ఆదేశించారు. ఈ పరీక్షకు చేతి గడియారాలకు అనుమతి లేని దృష్ట్యా ప్రతి కేంద్రంలో గోడ గడియారాలు ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల వద్ద భద్రతపై డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో త్వరలో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.
మరిన్ని వార్తలు