ఏడాదిలోగా 'డబుల్‌' ఇళ్ల నిర్మాణం పూర్తి

23 Jan, 2017 02:24 IST|Sakshi
గజ్వేల్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌ పథకం పనులను ప్రారంభిస్తున్న మంత్రి హరీశ్‌ రావు

గజ్వేల్‌: గజ్వేల్‌లో ఏడాదిలోగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ లోని సంగాపూర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల వెనుక భాగంలో రూ. 100 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన డబుల్‌ బెడ్‌రూం మెగా టౌన్‌షిప్‌ పనులను, అలాగే.. ఇదే ప్రాంగణంలో జర్నలిస్టు కాలనీ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డబుల్‌ బెడ్‌రూమ్‌ పథకాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు

ప్రస్తుతం 1,200లకు పైగా నిర్మిస్తున్న ఇళ్లను నిర్మిస్తున్నట్లు తెలిపా రు. అంతకంటే ఎక్కువ మంది అర్హులైన లబ్ధిదారులుంటే సీఎం కేసీఆర్‌తో మాట్లాడి.. వారికి కూడా పథకాన్ని వర్తిం పజేస్తామన్నారు. లబ్ధిదారుల ఎంపికలో పైరవీలకు తావు లేదని స్పష్టం చేశారు. గజ్వేల్‌ నగర పంచాయతీ పరిధిలోని 20 వార్డుల్లో ‘మిషన్‌ భగీరథ’పైప్‌లైన్ల విస్తరణ, నల్లా కనెక్షన్ల బిగింపు పూర్తి కాగానే.. సీసీ రోడ్లు, మురికి కాల్వల నిర్మా ణానికి రూ.20 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు.  కార్య క్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు