గొర్రెలు పంపిణీ చేసిన మంత్రి పోచారం

20 Jun, 2017 18:31 IST|Sakshi

కామారెడ్ఢి జిల్లా: బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామంలో లబ్ధిదారులకు సబ్సిడీ గొర్రెలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం మంత్రి పోచారం మాట్లాడుతూ..దేశంలోని 29 రాష్ట్రాలలో 35 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ప్రభుత్వం పథకాల సబ్సిడీని నేరుగా లబ్ధిదారులకు ఇస్తుందన్నారు.

స్వాతంత్ర్యం అనంతరం యాదవులకు పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణనే స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప ఆశయంతో, గొర్రెల కాపరులు అభివృద్ధి కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ ఏడాది సగం, వచ్చే ఏడు సగం మంది చొప్పున రెండేళ్లలో అర్హులందరికీ గొర్రెలను పంపిణీ చేస్తామన్నారు. భవిష్యత్లో తెలంగాణ యాదవులు దేశంలోనే ధనికులు అవుతారని జోస్యం చెప్పారు.

మరిన్ని వార్తలు