బిర్కూర్ మండలంలో మంత్రి పోచారం పర్యటన

23 Jun, 2016 13:00 IST|Sakshi

వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి గురువారం నిజామాబాద్ జిల్లా బిర్కూర్ మండలంలో పర్యటించారు. తిమ్మాపూర్‌లోని అంకూశ్‌ఖాన్‌చెరువు మినీ ట్యాంక్‌బండ్ పనులను పరిశీలించారు. అనంతరం తిమ్మాపూర్‌లోని వేంకటేశ్వరాలయంలో పూజలు చేశారు. దాత ఉప్పలపాటి సుబ్బారావు స్వామివారికి చేయించిన బంగారు నగలను స్వామి వారికి అలంకరింపజేశారు. ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.
 

మరిన్ని వార్తలు