రేషన్ షాపును ఆకస్మికంగా తనిఖీచేసిన మంత్రి సునీత

3 Jul, 2016 15:38 IST|Sakshi

 వినియోదగారుని ఫిర్యాదు మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ప్రొద్దుటూరులోని రేషన్ షాపును ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రొద్దుటూరు రామేశ్వరం రోడ్డులోని 75వ నంబరుగల రేషన్ దుకాణాన్ని మంత్రి తనిఖీచేసి డీలర్‌ను హెచ్చరించారు. మహబూబ్‌బాషా అనే వినియోగదారుడు రంజాన్ తోపాలో తీసుకున్న గోధుమల్లో 5 కిలోలకు గాను 4 కిలోలు మాత్రమే ఇచ్చారని ప్రొద్దుటూరులో ఒక కార్యక్రమానికి హాజరైన మంత్రికి ఫిర్యాదు చేశాడు.

 స్పందించిన మంత్రి వెంటనే 75వ నంబరు రేషన్ షాపును తనిఖీ చేశారు. షాపు మూసిఉండడంతో డీలర్‌ను పిలిపించి తెరిపించి సరుకులను తనిఖీ చేశారు. ఎలక్‌ట్రానిక్ తూనికల యంత్రం ఉన్నా తూకంరాళ్లు ఉండటాన్ని గమనించి డీలర్‌ను హెచ్చరించారు. ఇంకోసారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. మంత్రి వెంట ఎంపీ సీఎం రమేష్, పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు