కుమార్తెతో అసభ్య ప్రవర్తన.. తండ్రిపై కేసు

11 May, 2017 01:04 IST|Sakshi
ఇరగవరం : కుమారైతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ తండ్రిపై కేసు నమోదు చేసినట్టు ఇరగవరం ఎస్సై కేవీవీ శ్రీనివాస్‌ తెలి పారు. వివరాలిలా ఉన్నాయి.. ఇరగవరం శివారు అనుమాజిపాలెంకు చెందిన ఉందుర్తి రఫాయేలు అనే వ్యక్తి రెండో వివాహం చేసుకుని కొంతకాలం నుంచి మొదటి భార్యతో విడిగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో మొదటి భార్య కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధిత యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు.
 
గిరిజన యువతిపై అత్యాచారం
బుట్టాయగూడెం: గిరిజన యువతిపై ఓ వ్యక్తి అత్యాచారం చేసినట్టు ఫిర్యాదు అం దిందని ఎస్సై డి.కాళీచరణ్‌ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. కామయ్యకుంటకు చెం దిన టి.గంగరాజు తనను అత్యాచారం చేసినట్టు మొద్దప్పగూడెంకు చెందిన ఓ గిరిజన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు.
 
మరిన్ని వార్తలు