మాతా శిశుసంరక్షణ భవనం ప్రారంభం

23 Jun, 2017 23:46 IST|Sakshi
మాతా శిశుసంరక్షణ భవనం ప్రారంభం

హిందూపురం అర్బన్‌ : ‘పురం’లో రూ.20.15 కోట్లతో నిర్మించిన మాతా శిశు సంరక్షణ ఆస్పత్రి భవనాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి కమిటీ అధ్యక్షుడు వెంకటస్వామి అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ తల్లీబిడ్డలను రక్షించుకోవడం అందరి బాధ్యతన్నారు. తాను మూడు నెలలుగా షూటింగ్‌లో ఉన్నప్పటికీ ఫోన్‌లో నియోజకవర్గ సమస్యలు తెలుసుకుంటున్నానన్నారు.

మంత్రి కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్పొరేట్‌కు దీటుగా ఏర్పాటైన ఈ ఆసుపత్రికి వైద్యసిబ్బందిని త్వరలోనే నియమిస్తామన్నారు. ఎమ్మెల్యే, తాను హిందూపురం ఆసుపత్రిలో ఒకరోజు రాత్రి బస చేస్తామన్నారు. మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ హిందూపురంలో వైద్యపరంగా ఎంతో అభివృద్ధి చేశామన్నారు. కార్యక్రమంలో జేసీ ఖాజామొహిద్దీన్‌, బీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ రంగనాయకులు, డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, డీసీహెచ్‌ రమేష్‌నాథ్, సూపరింటెండెంట్‌ కేశవులు, ఆర్‌ఓఎం రుక్మిణమ్మ తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ పిల్లలకు పుస్తకాలు, బొమ్మలు పంపిణీ
ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో స్థానిక మోడల్‌కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రీ క్వానెంట్‌ను ఎమ్మెల్యే బాలకృష్ణ, మంత్రి సునీత ప్రారంభించారు. చిన్నారులకు పుస్తకాలు, బొమ్మలు పంపిణీ చేశారు.

మరిన్ని వార్తలు