గుత్తిలో ఎమ్మెల్యేకు చుక్కెదురు

20 Jun, 2017 22:39 IST|Sakshi
గుత్తిలో ఎమ్మెల్యేకు చుక్కెదురు

– ఎమ్మెల్యేను చుట్టుముట్టిన జెండా కాలనీవాసులు
– కమిషనర్, చైర్‌ పర్సన్‌లపై ఎమ్మెల్యే ఆగ్రహం

గుత్తి : రంజాన్‌ తోఫా పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జితేందర్‌ గౌడ్‌కు కాలనీవాసుల నుంచి చుక్కెదురైంది. పట్టణంలోని జెండావీధిలో నాగరాజు స్టోర్‌ వద్ద మంగళవారం చంద్రన్న రంజాన్‌ తోఫా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. రంజాన్‌ తోఫాను ముస్లింలకు పంపిణీ చేశారు. పంపిణీ కార్యక్రమం ముగుస్తున్న సమయంలో ఒక్కసారిగా జెండా వీధి కాలనీవాసులు స్టేజి వద్దకు దూసుకెళ్లారు. రంజాన్‌ తోఫా సంగతి పక్కన బెట్టండి ముందు కాలనీలో తాగునీటి సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యేను చుట్టుముట్టారు. ఎమ్మెల్యే నచ్చజెప్పడానికి ప్రయత్నించినా కూడా వినలేదు.

గత 15 రోజులుగా కాలనీకి నీళ్లు వదలలేదన్నారు. ఈ రోజు మీరు వస్తున్నారనే కారణంతో హడావుడిగా నీళ్లు వదిలారన్నారని ఆగ్రహించారు. దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే అక్కడే ఉన్న మున్సిపల్‌ కమిషనర్‌ ఇబ్రహీం సాబ్, చైర్‌ పర్సన్‌ తులశమ్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి సమస్య ఉందని తనకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. మీకు చేత కాకపోతే నాకు చెప్పండి తాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. అప్పటికీ జనాలు శాంతించకపోయే సరికి చేసేది లేక కోపంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

కూతురి పెళ్లికి అప్పు దొరక్క తండ్రి ఆత్మహత్య

ముంపు..ముప్పు..

మత సామరస్యానికి ప్రతీక అబ్బాస్‌ దర్గా

'పెట్టె' ఫలితమివ్వలే!

తప్పుడు లెక్కలు చెబితే చర్యలు

దోమ కాటు.. కాలుష్యం పోటు

మద్యంపై పోరాటానికి మద్దతు ఇవ్వండి

విద్యాశాఖ నిర్లక్ష్యంతో కుమారుడిని పోగొట్టుకున్నా..

వృద్ధ దివ్యాంగులకు మోటారు వాహనాలివ్వండి..

బ్యారన్‌లు ముంచేశాయి

కిడ్నీలు పనిచేయడం లేదన్నారయ్యా!

అర్హత ఉన్నా పింఛన్‌ ఇవ్వడం లేదు

కుటుంబ పోషణ భారంగా ఉంది

ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వడంలేదు:

జగనన్న పేరు పెట్టడం సంతోషంగా ఉంది

వ్యాపారులకు కొమ్ముకాస్తోంది

ముస్లింలను ఆదుకోవాలి

ఫ్లోరైడ్‌ నీరు ప్రాణాలు తీస్తోంది

కేబుల్‌ ఆపరేటర్లకు అన్యాయం చేయొద్దు

అధికారిక దోపిడీ

బ్యాడ్మింటన్‌ ఆడుతూ కానరాని లోకాలకు..

మీటరు వడ్డీతో అల్లాడిపోతున్నాం..!

పశువుల లెక్క పక్కాగా

దాహం తీర్చేదెలా?

ఏమంటాం..ఇష్ట‘పడక’!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం