జెడ్పీని కుదిపేసిన బాక్సైట్

30 Dec, 2015 23:23 IST|Sakshi
జెడ్పీని కుదిపేసిన బాక్సైట్

విశాఖపట్నం: 2015లో విశాఖ జిల్లా చరిత్రలో ఇది చీకటి దినం అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు వ్యాఖ్యానించారు. విశాఖ జెడ్పీ సమావేశంలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై టీడీపీ నేతలు దౌర్జన్యం చేశారు. బాక్సైట్ అంశంపై బుధవారం జరిగిన సమావేశం దద్దరిల్లింది. సమావేశం ప్రారంభం కాగానే అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మాట్లాడుతూ... బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని పట్టుబట్టారు. దీనికి టీడీపీ ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పీలా గోవింద్‌తోపాటు ఆ పార్టీకి చెందిన ఇతర సభ్యులు అడ్డుతగిలారు. ప్రతిపక్ష నేతలకు మైకులు ఇవ్వడానికి అధికార పార్టీ నేతలు నిరాకరించారు. ఎమ్మెల్యే కిడారికి మైక్ ఇవ్వడానికి వీల్లేదంటూ దౌర్జన్యానికి దిగారు.


ఆయన మాట్లాడుతుంగా చేతిలో ఉన్న మైక్‌ను లాక్కున్నారు. దీంతో కిడారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు మాట్లాడే అవకాశం ఇవ్వరా అని ఆవేదన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.  ఏపీ అసెంబ్లీలో మైకులు కట్ చేశారు.. ఇప్పుడు జడ్పీ సమావేశంలో మైకులు ఇవ్వకపోవడం ప్రతిపక్షం గొంతు నొక్కడమేనంటూ కిడారి సర్వేశ్వరరావు వ్యాఖ్యానించారు. ప్రతిపక్షానికి మైకులు ఇవ్వకపోవడం దుర్మార్గమని, టీడీపీ నేతల తీరుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు