ప్రొటోకాల్‌ ఉల్లంఘనపై ఎమ్మెల్యే ఆగ్రహం

25 Oct, 2016 23:21 IST|Sakshi
అడ్డతీగల : 
అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్‌ పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అధికారులపై ధ్వజమెత్తారు. రూ.పది లక్షల ఐఏపీ నిధులతో అడ్డతీగలలో నిర్మించిన గ్రంథాలయ భవనానికి జిల్లా గ్రంథాలయ సంస్థ అధికారులు మంగళవారం ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే అధికారుల వ్యవహార శైలిని తప్పుబట్టారు. ఆహ్వాన పత్రికలో పేర్ల ముద్రింపులో నిబంధనలు పాటించలేదన్నారు. భవన ప్రారంభోత్సవ విషయంపై తమకు తగిన సమాచారం ఇవ్వలేదన్నారు. శిలాఫలకంపై అడ్డతీగల సర్పంచ్‌కు, ఎమ్మెల్యే అయిన తనకు సముచిత ప్రాధాన్యం ఇవ్వకుండా వ్యవహరించారన్నారు. అధికారుల ప్రొటోకాల్‌ ఉల్లంఘనపై తాను శాసనసభలో ప్రస్తావిస్తానన్నారు. ఇదే సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్‌ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్‌ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్‌ అమలయ్యేలా చూడాల్సిన డీఆర్వో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. అన్ని పనులకూ తమ సేవలు వినియోగించుకున్న అధికారులు ప్రారంభోత్సవంలో మాత్రం ప్రాధాన్యం ఇవ్వకుండా అవమానించడం దారుణమని అడ్డతీగల సర్పంచ్‌ పప్పుల చిట్టమ్మ అన్నారు.
అధికారులది పొరబాటే..
అధికారులు ఈ విషయంలో పొరపాటు చేశారని, మరోసారి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మ¯ŒS నల్లమిల్లి వీరారెడ్డి అన్నారు.  
 
మరిన్ని వార్తలు