కేసులకు భయపడబోను..

19 Nov, 2016 00:05 IST|Sakshi
  • దివీస్‌ బాధితుల పక్షానే పోరు 
  • తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా
  • కాకినాడ :
    ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన సోదరుడు కృష్ణుడుల అరాచకాలు రోజురోజుకీ మితిమీరి పోతున్నాయని, కేసులు పెట్టి వేధింపులకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆరోపించారు. అయినా వెనుకడుగు వేయకుండా దివీస్‌ బాధితుల పక్షాన పోరాడతానని స్పష్టం చేశారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయిన తనను టీడీపీ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. గత రెండేళ్ళలో ఎదుర్కొన్న ఇబ్బందులను ఆయన శుక్రవారం విలేకరులకు చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే..
    తుని నియోజకవర్గంలో జరుగుతున్న అనేక సంఘటనల్లో బాధితుల పక్షాన నిలబడడంతో కక్ష కట్టారు. ఏడు సెక్ష¯ŒS 307 కేసులతో పాటు మరో 22 కేసులు బనాయించారు. పేదల పక్షాన పోరాడుతున్న ప్రతిసారీ ఏదోరకంగా కట్టడి చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి తాటాకు చప్పుళ్ళకు బెదిరిపోయే వ్యక్తిని కాదు. ఎంతో నమ్మకంతో గెలిపించిన ప్రజల పక్షాన ప్రభుత్వంపై పోరాడతా. ఎన్ని కేసులు పెట్టినా, మరెన్ని బెదిరింపులకు పాల్పడినా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు.
    నాడు ఏరువాక చేసి.. నేడు వేధింపులా!
    ఎస్‌ఈజడ్‌ భూముల విషయంలో నానా హంగామా చేసి నాగలిపట్టి ఏరువాక చేసిన చంద్రబాబు ఇప్పుడు పేదరైతుల పొట్టకొట్టి అయిన వారి కోసం కోట్లాది రూపాయల భూములను దివీస్‌కు ధారాదత్తం చేశారు. ఎన్నికల మందు ఇంటికి పెద్దకొడుకుగా ఆదరించాలన్న చంద్రబాబు ఏరుదాటాక తెప్ప తగలేసిన చందాన వ్యవహరిçస్తున్నారు. దివీస్‌ పరిశ్రమ వల్ల  పంపాది పేట, తాటియాకుల పాలెం గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి ఆ ప్రాంతం నుంచి నాకు 86 ఓట్లే వచ్చాయి. దాంతో ఇప్పుడు నా వద్దకు వచ్చేందుకు ఆ  ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయినా బాధ్యత కలిగిన ప్రజా ప్రతిని«ధిగా వారి పక్షాన నిలబడి పోరాడుతున్నాను. 78 రోజులుగా దివీస్‌ ప్రాంతంలో 144 సెక్ష¯ŒS విధించి అణచివేత ధోరణితో వ్యవహరించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ముద్రగడ అంశానికి సంబం«ధించి తుని ఘటనలో 164 మందిపై కేసులు నమోదు చేస్తే అందులో ఎక్కువ శాతం వైఎస్సార్‌ సీపీకి చెందినవారే. వికలాంగులు, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రజలను కేసుల్లో ఇరికించారు. చంద్రబాబు డైరెక్ష¯ŒSలోనే తుని సంఘటన చోటుచేసుకుంది.  ఆనాడు జరిగిన సంఘటనలన్నింటికీ చంద్రబాబే కారణం. తునిలో పుట్టడమే నేరమన్న ««ధోరణిలో తెలుగు దేశం పార్టీ అరాచక పాలన  కొనసాగిస్తోంది’ అంటూ రాజా ధ్వజమెత్తారు.
     
మరిన్ని వార్తలు