30ఏళ్ల అరాచక పాలన..

2 Jun, 2017 12:55 IST|Sakshi
30ఏళ్ల అరాచక పాలన..

► పిఠాపురంలో మూడేళ్లలో మించి పోయింది : రాజా
గొల్లప్రోలు (పిఠాపురం) : తునిలో 30 ఏళ్లుగా సాగుతున్న అరాచక పాలనను.. పిఠాపురంలో గత మూడేళ్లుగా పాలన మించిపోయిందని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. గొల్లప్రోలులో గురువారం నిర్వహించిన వైఎస్సార్‌ సీపీ పిఠాపురం నియోజకవర్గ ప్లీనరీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తునిలో గురువును తలదన్నేలా పిఠాపురంలో శిష్యుడు అకృత్యాలకు పాల్పడి...రాచరిక పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే వర్మను ఉద్దేశించి అన్నారు. మట్టి, ఇసుకను అమ్ముకుని నియోజకవర్గాన్ని దోచుకు తింటున్నారన్నారు.

మట్టిని తవ్వుకోడానికి చెరువులను ఎండగట్టిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. మొసలి కన్నీరు కార్చి ఓట్లు వేయించుకుని.. ఇప్పుడు ఓట్లు వేసిన ప్రజల ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు తిరగబడే రోజులు వస్తున్నాయన్నారు. ప్రతిపక్ష నేతను విమర్శించాను.. మంత్రి పదవి ఇవ్వండని అధినేత ముందు మోకరిల్లుతున్న ఆయన.. స్థాయిని మరచి విమర్శలు చేస్తే సహించేదిలేదని ఎమ్మెల్యే రాజా హెచ్చరించారు.

మరిన్ని వార్తలు