ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి హాజరైన ప్రముఖులు

7 Aug, 2016 22:16 IST|Sakshi
పెళ్లికి హాజరైన డిప్యూటీ సీఎం

పటాన్‌చెరు: పటాన్‌చెరు ఎమ్మెల్యే  గూడెం మహిపాల్‌రెడ్డి ద్వితీయ పుత్రుడు విక్రమ్‌రెడ్డి వివాహా మహోత్సవం ఘనంగా జరిగింది. పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారు ఈ పెళ్లికి హాజరయ్యారు. విక్రమ్‌రెడ్డి, పల్లవిల వివాహాం ఘనంగా జరిగింది. పటాన్‌చెరు శివారులోని జిఎంఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో వైభవోపేతంగా వివాహం నిర్వహించారు.

ఈ వివాహా మహోత్సవానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ మధుసూధనాచారి, ఉప ముఖ్య మంత్రి మహ్మూద్‌ అలీ, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, మంత్రి హరిష్‌రావు డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి, జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డి, శంభీపూర్‌రాజు, ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్‌, మదన్‌రెడ్డి,మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, అతని సోదరుడు మధుసూధన్‌రెడ్డిల స్నేహితులు, అభిమానులు, బంధుగణం ఈ పెళ్లికి హాజరయ్యారు.

వివాహ మహోత్సవం సందర్భంగా పట్టణమంతటా సందడి కనిపించింది. వీఐపీల రాక పోకలు ఔటర్‌ మీదుగా సాగినా పట్టణంలో కన్వెన్షన్‌ సెంటర్‌ వైపు వచ్చిపోయే వాహనాలతో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఎంపీపీలు శ్రీశైలం యాదవ్‌, రవీందర్‌రెడ్డి, యాదగిరియాదవ్‌లు కూడ పాల్గొని వీఐపీలను ఆహ్వానించడంలో బిజీగా కనిపించారు. మోదీ రాకతో మరింత మంది రాష్ట్ర స్థాయి నాయకులు మంత్రులు వీఐపీలు రాలేకపోయారని భావిస్తున్నారు. పట్టణంలో అన్ని కూడళ్ల వద్ద ప్రజలు ఎమ్మెల్యే తనయుడి వివాహం ఏర్పాట్లు కొత్తగా నిర్మించిన జిఎంఆర్‌ కన్వెన్షన్‌ చేయడంపై పలువురు వివాహ ఏర్పాట్ల గురించి చర్చించుకున్నారు.ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన గొప్ప విందు భోజనాలపై కూడా చర్చ జరిగింది.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా