డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేయొద్దు

16 Jul, 2016 22:37 IST|Sakshi
డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేయొద్దు

 రాయచోటి:
 ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రోజు రోజుకు డ్వాక్రా సంఘాలు నిర్వీర్యం అవుతున్నాయని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తన కార్యలయంలో విలేకర్లతో మాట్లాడారు. డ్వాక్రా మహిళలకు సరైన ప్రోత్సాహం, అవగాహన కల్పించలేకపోవడం వల్ల ఎం తో మంది మహిళలు సంఘాలలో చేరడానికి వెనుకడుగు వేస్తున్నారన్నారు. ప్రభు త్వ తీరు వల్లనే వేలాది సంఘాలు వెనుకబడి(సిక్) పోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల నుంచి జరుగుతున్న గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమానికి ప్రజల నుంచి ఆదరణ, మంచి స్పందన లభిస్తోందన్నారు.

మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయడంలేదని ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారన్నారు. బ్యాంకులలో తాకట్టుపెట్టిన బంగారు, అప్పు తీసుకున్న ప్రతి రూపాయిని మాఫీ చేస్తామన్నారు.. మహిళలకు సెల్ఫోన్లు ఇస్తామన్నారు.. రాయచోటిలో మహిళాపోలీసు స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు.. వీటిలో ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలపైన ప్రజలు మండిపడుతున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని చాలా పల్లెల్లో సక్రమంగా పంటలు పండక, కుటుంబపోషణ కోసం పాడిపశువులపై దృష్టి పెట్టారన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత హెరిటేజ్ సంస్థ బాగుకోసం ప్రభుత్వానికి చెందిన విజయ డెయిరీని నిర్వీర్యం చేసి, లీటరు పాలును రూ.20లకే కొనుగోలు చేసి, ఐదారు నెలల పాటు బిల్లులు చెల్లించక, పాడిరైతులను ఆర్థికంగా దెబ్బతీస్తున్నట్లు తెలిపారు. హెరిటేజ్కు పాలు పోయడానికి రైతులు సిద్ధమేనని, అయితే గిట్టుబాటు ధర లీటరుకు రూ.30లు చేసి క్రమం తప్పకుండా బిల్లులు చెల్లిస్తే చాలన్నారు. అలా చేస్తే రైతుకుల భరోసా కల్గించినట్లువుతుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకివస్తే లీటరు పాలు ధర రూ.30లు చేస్తామన్నారు. గతంలో చెప్పిన ప్రకారం డ్వాక్రా అక్క , చెల్లెల్లకు రుణమాఫీ చేసి తీరుతామన్నారు.
 

మరిన్ని వార్తలు