సర్వం నారాయణ మంత్రం

16 Nov, 2016 01:28 IST|Sakshi
సర్వం నారాయణ మంత్రం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రి నారాయణదే పెత్తనం
కినుక వహించిన జిల్లా మంత్రి బొజ్జల
ఎడతెగని పంతాలు, పట్టింపులు తేలని అభ్యర్థిత్వాలు

తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో ఇన్‌చార్జి మంత్రి నారాయణ, జిల్లాకు చెందిన మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మధ్య విభేదాలు పొడచూపుతున్నాయా? సీట్ల కేటారుుంపులో ఇద్దరూ పట్టింపులకు పోతున్నారా? ఎన్నికల భారాన్ని మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పురపాలక మంత్రి నారాయణకు అప్పగించడంతో బొజ్జల కినుక వహించారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తున్నారుు.

చిత్తూరు, సాక్షి: తూర్పు రాయలసీమ ఎమ్మె ల్సీ ఎన్నికలకు సంబంధించి సభ్యత్వ నమోదు పూర్తరుుంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. వామపక్ష అభ్యర్థులు మాత్రమే ప్రచారం చేసుకుంటున్నారు.

నారాయణే చూసుకుంటారులే..
ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలనే అంశంపై జిల్లా టీడీపీలో గందరగోళం నెలకొంది. జిల్లాకు చెందిన మంత్రిని, తనను సంప్రదించకుండా అభ్యర్థుల పేర్లను ఎలా పరిశీలిస్తారంటూ బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి కినుక వహించారని సమాచారం. ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత సీఎం తనపై ఉంచారని, అందుకే తాను గెలుపు గుర్రాలను ఎంచుకుంటానని మంత్రి నారాయణ అంటున్నారని సమాచారం. కొన్ని రోజుల క్రితం జరిగిన పార్టీ సమీక్ష సమావేశంలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేశారని విశ్వసనీయ సమాచారం. ఎన్నికల ఏరా ట్లు ఎలా ఉన్నాయని అధిష్ఠానానికి దగ్గరగా మెలిగే ఓ నాయకుడు మంత్రి బొజ్జలను అడగ్గా..’ ఎన్నికలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారాయణ భుజస్కంధాలపై ఉంచారుగా ఆయనే చూసుకుంటారు’లే అని ఎద్దేవా చేసినట్లు ఆ పార్టీ నాయకులే పేర్కొన్నారు.

అభ్యర్థిత్వం ఎవరికో ?
అభ్యర్థులను ఖరారు చేయడంలో టీడీపీ తర్జనభర్జనలు పడుతోంది. మంత్రుల  భేదాభిప్రాయాలు అభ్యర్థుల ఎంపికలో జాప్యానికి కారణమవుతోందని టీడీపీ నా యకులు అంటున్నారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల అభ్యర్థిత్వాల్లో ఒకటి ’రెడ్డి’ సామాజిక వర్గానికి ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఉపాధ్యాయులు, యువతలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండటంతో గెలుపు సులభంకాదని పోటీకి అభ్యర్థులు వెనకడుగు వేస్తున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సాకం నాగరాజు పేరు పరిశీలనలో ఉంది. ఆయన మాత్రం వేచి చూసే ధోరణితో ఉన్నారు.  పట్టభద్రుల స్థానానికి రెండు సార్లు పోటీచేసి ఓడిపోరుున దేశారుుశెట్టి హనుమంత రావుకు టికెట్ ఆశిస్తున్నారు. మంత్రి నారాయణ పట్టభద్రుల స్థానానికి తనకు అత్యంత ఆప్తుడు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సాకం ఒప్పుకోకపోతే పట్టాభిని ఉపాధ్యాయ స్థానానికి, దేశారుు శెట్టిని పట్టభద్రుల స్థానానికి అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు