రాజుగారూ.. రాజీనామా చేయండి

9 Jun, 2016 08:33 IST|Sakshi
రాజుగారూ.. రాజీనామా చేయండి

 బొబ్బిలి: వైఎస్‌ఆర్‌సీపీ గుర్తుపై గెలిచిన బొబ్బిలి ఎమ్మె ల్యే సుజయ్‌కృష్ణ చిత్తశుద్ది ఉంటే పదవికి రాజీనామా చేసి ప్రజా గౌరవం పొందాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి సవాల్ చేశారు. బొబ్బిలిలో తూముల రాంసుధీర్ ఆధ్వర్యంలో అప్పయ్యపేట రోడ్డులో పార్టీ కార్యాలయాన్ని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు బుధవారం ప్రారంభించారు.
 
 ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జరిగిన సభలో కోలగట్ల మాట్లాడుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించాక వైఎస్సార్ సీపీలో బొబ్బిలి రాజులు చేరారు తప్ప... పార్టీని వారు తీసుకురాలేదని పేర్కొన్నారు. కాబట్టి ఆ పార్టీద్వారా దక్కిన పదవిని విడచిపెట్టాల్సిందేనని చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడినప్పుడు పార్టీకి, ఎమ్మెల్సీకి రాజీనామా చేసి వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన విషయాన్ని గుర్తు చేశారు. రాజులు పార్టీ వీడినా పార్టీ మాత్రం చెక్కుచెదరలేదనీ, దాని బలం తగ్గలేదని స్పష్టం చేశారు. రాజులకు ఒకప్పుడు గౌరవం ఉండేదనీ, ఇప్పుడు అది పోయిందని పేర్కొన్నారు.
 
 సాలూరు, కురుపాం ఎమ్మెల్యేలు నీతికి మారుపేరు
 సాలూరు, కురుపాం ఎమ్మెల్యేలు రాజన్నదొర, పుష్ప శ్రీవాణిలు నీతి, నిజాయితీకి మారుపేరని కొనియాడా రు. వారిద్దరి ఆధ్వర్యంలో బొబ్బిలిలో వైఎస్సార్ సీపీ మ రింత అభివృద్ధి చెందుతుందన్నారు. బొబ్బిలి నాయకు లు, కార్యకర్తలకు జిల్లా పార్టీ అండగా ఉంటుందనీ, త్వరలో పట్టణంలో శాశ్వత కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామనీ తెలిపారు. కేంద్రపాలక మండలి సభ్యుడు పెనుమత్స మాట్లాడుతూ పార్టీకి ప్రజలుంటే చాలని, నాయకులు అక్కరలేదన్నారు. వైఎస్‌ఆర్‌సీపీకి ప్రజాభి మానం ఉందన్నారు. మహారాజుల కాలం పోయిందని, అశోక్ లాంటి వారినే విజయనగరంలో ఓడించి కోలగట్లకు పట్టం కట్టడాన్ని మరచిపోకూడదన్నారు.
 
 నేతల్లేకపోయినా కార్యకర్తల అండ
 జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములునాయుడు మాట్లాడుతూ తాము లేకపోతే బొబ్బిలిలో పార్టీయే లేద ని రాజులు భ్రమలు కలిగించారని, కానీ పార్టీ వెంట ఉన్నామని కార్యకర్తలు నిరూపించారన్నారు. జిల్లా కార్యదర్శి డోల బాబ్జీ మాట్లాడుతూ ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసి పార్టీని వీడిన వారికి ఎన్నికల్లో బుద్ది చెప్పేలా కార్యకర్తలు పనిచేయాలన్నారు. తెర్లాం పార్టీ నాయకుడు మర్రాపు జగన్నాథం మాట్లాడుతూ వైఎస్సార్ సీపీని బొబ్బిలిలో ముందుకు నడిపిస్తామన్నారు.
 
 రాజన్న సేవా సమితి వ్యవస్థాపకుడు తూముల రాంసుధీర్ మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని అమ లు చేయలేదన్నారు. కార్యక్రమంలో విజయనగరానికి చెందిన సుంకరి బాబు, లెంక సత్యం, వినోద్ కుమార్ దుబే, ట్రేడ్ యూనియన్ నాయకుడు నాగరాజు, స్థానిక నాయకులు చంద్రంపూడి రమేష్, బొమ్మి అప్పలనాయుడు, కోల బాలాజీ తిరుపతిరావు, బర్ల వెంకటరమణ యాదవ్, పట్నాన శంకరరావు, వై.సి.హెచ్.జి.రంగారావు, గర్బాపు దాలయ్య, చోడిగంజి రాజగోపాలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు