అన్ని జిల్లాల్లో మోడల్‌ డిగ్రీ కాలేజీలు

27 Jul, 2016 01:01 IST|Sakshi
అన్ని జిల్లాల్లో మోడల్‌ డిగ్రీ కాలేజీలు

ఉన్నత విద్య, ఆర్‌జేడీ, మల్లేశ్వరి
– నాలుగైదు రోజుల్లో  కాంట్రాక్టు లెక్చరర్ల రెన్యూవల్‌
– ఉన్నత విద్య రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ కె. మల్లీశ్వరి

బనగానపల్లె : కర్నూలు జిల్లా ఆత్మకూరు మోడల్‌ డిగ్రీ కళాశాల తరహాల్లో రాయలసీమ పరిధిలోని అన్ని జిల్లాల్లో డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు కషి చేస్తున్నట్లు ఉన్నతవిద్యాశాఖ రిజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ కె. మల్లీశ్వరి తెలిపారు. రాయలసీమ పరిధిలోని డిగ్రీకాలేజీలకు సంబంధించి 305 మంది కాంట్రాక్టు లెక్చరర్ల పోస్టులను త్వరలో రెన్యూవల్‌ చేస్తామని తెలిపారు. బనగానపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులతోపాటు తరగతి గదులను పరిశీలించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రీయ ఉశ్చరత శిక్షణ అభియాన్‌ (రూసా) కింద రాయలసీమకు సంబంధించి 14 ప్రభుత్వ డిగ్రి కళాశాలలను ఎంపిక చేశామని తెలిపారు. వీటిలో మౌలిక వసతుల కల్పన కోసం రూ.2 కోట్ల ప్రకారం ఖర్చు చేస్తామన్నారు. ఇటీవలే ఆత్మకూరులో మోడల్‌ డిగ్రీ కళాశాలను ప్రారంభించామని చెప్పిన ఆమె అనంతపురం జిల్లా హిందూపూరంలో కూడా అదే తరహా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చిత్తూరు, కడప జిల్లాలో కూడా ఈ తరహా కాలేజీలు ఏర్పాటు చేసి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు కషి చేస్తామన్నారు. విలేకరుల సమావేశంలో ఆర్‌జేడీ సూపరింటెండెంట్‌ హనుమాయమ్మ, కళాశాల ప్రిన్సిపాల్‌ స్వర్ణలతాదేవి, న్యాక్‌ కో ఆర్డినేటర్‌ హెచ్‌ రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు