నమూనా ఇళ్ల నిర్మాణం

31 Aug, 2016 22:20 IST|Sakshi
నమూనా ఇళ్ల నిర్మాణం
 
  •  3న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ప్రారంభం
  • కలెక్టర్‌ ముత్యాలరాజు  
వెంకటాచలం:  మండలంలోని చౌటపాళెం పంచాయతీలోని సరస్వతీనగర్‌లో  బిల్డింగ్‌ మెటీరియల్‌ టెక్నాలజీ ప్రమోషన్‌ కౌన్సిల్‌(బీఎంటీపీసీ) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మోడల్‌ హౌస్‌ సముదాయాన్ని సెప్టంబర్‌ 3న కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు చేతులుమీదుగా ప్రారంభించనున్నట్లు కలెక్టర్‌ ముత్యాలరాజు తెలిపారు. మోడల్‌ హౌస్‌ సముదాయాన్ని కలెక్టర్‌ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.4.55కోట్లతో మొత్తం 36 ఇళ్లను సముదాయంలో నిర్మిస్తున్నట్లు తెలిపారు. జీఎఫ్‌ఆర్‌జీ సిస్టంతో నిర్మిస్తున్న ఇళ్లను 36 మంది లబ్ధిదారులకు కేటాయిస్తామని చెప్పారు. అలాగే ప్రాంగణంలో రూ.73.4లక్షలతో కమ్యూనిటీహాలు, మరో రూ.72.4లక్షలతో ప్రాంగణాన్ని అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. కలెక్టర్‌ వెంట బీఎంటీపీసీ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ శైలేష్‌ అగర్వాల్, హౌసింగ్‌ పీడీ రామచంద్రారెడ్డి, తహసీల్దార్‌ సుధాకర్, తదితరులు ఉన్నారు.
హెలిప్యాడ్‌ పరిశీలన 
వెంకటాచలం మండలానికి సెప్టంబర్‌ 3,4 తేదీల్లో ప్రముఖులు రానున్నారు. 3న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, 4న లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్, రియో ఒలింపిక్స్‌ రజక పతక విజేత పీవీ సింధు, బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు పుల్లెల్ల గోపిచంద్‌తో పాటు  పలువురు కేంద్ర మంత్రులు రానున్నారు. స్వర్ణభారత్‌ట్రస్ట్, అక్షర విద్యాలయాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా వెంకటాచలంలోని క్యూబా కళాశాలలో హెలిప్యాడ్‌ ఏర్పాట్లను  కలెక్టర్‌ ముత్యాలరాజు పరిశీలించారు.
మరిన్ని వార్తలు