ఆదర్శం.. అదుర్స్‌

17 Sep, 2016 23:57 IST|Sakshi
ఆదర్శం.. అదుర్స్‌
  • వెయిట్‌ లిఫ్టింగ్‌లో విద్యార్థుల ప్రతిభ
  • రాష్ట్రస్థాయికి ఎంపిక
  • ధర్మపురి : పట్టణస్థాయి విద్యార్థులకు దీటుగా గ్రామీణ విద్యార్థులు ప్రతిభ కనబరుస్తున్నారు. చదువుతోపాటు క్రీడల్లోనూ సత్తా చాటుతున్నారు ధర్మపురి మండలం మగ్గిడి ఆదర్శ పాఠశాల విద్యార్థులు. వెయిట్‌లిఫ్టింగ్‌లో ప్రతిభకనబర్చి ఏకంగా రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. చొప్పదండి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌ ప్రభుత్వ పాఠశాలలో ఈ నెల 9న జూనియర్, సబ్‌జూనియర్‌లకు జిల్లాస్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలు నిర్వహించారు. ఇందులో ధర్మపురి మండలం మగ్గిడి ఆదర్శ పాఠశాలకు చెందిన ఐదుగురు బాలికలు, ముగ్గురు బాలురు ప్రతిభకనబర్చి జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ బుచ్చన్న సహకారం, ఫిజికల్‌ డైరెక్టర్‌ రాజేందర్‌ శిక్షణతో బహుమతులు సాధించారు.
    రాష్ట్ర స్థాయికి 8మంది..
    పాఠశాలకు చెందిన 8మంది జిల్లా స్థాయిలో పతకాలు సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. వారిలో ఆర్‌.మనూష(జైనా), జి.లావణ్య(నక్కలపేట), విరంచి స్వప్నిక, జ్యోష్నశ్రీ, వెంకటేశ్, పి.యశ్వంత్‌ (ధర్మపురి), జగన్‌(నేరెల్ల), కావ్య(చిన్నాపూర్‌) ఉన్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్‌ స్టేడియంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు.
     
     
మరిన్ని వార్తలు