దారులెన్నో

12 Nov, 2016 23:54 IST|Sakshi
  • వీళ్లంతా బడా ‘బాబు’లండీ...!  
  • ‘పచ్చ’ దనం ’తెల్ల’బోతోంది 
  • నల్లధనానికి కొత్త రూపులు
  • బడా బాబులు ఎందుకు బయటకు రావడం లేదో... మరి కోట్లు కూడబెట్టిన బడా బాబులు ఏం చేస్తున్నట్టు.? విత్‌డ్రా చేసుకున్నట్టు,  డిపాజిట్‌ చేస్తున్నట్టు ఈ సోకాల్డ్‌ బాబులు ఈ మూడు రోజుల్లో జిల్లాలో ఏ బ్యాంకు కౌంటర్లోనూ దర్శనమివ్వడం లేదంటే ఏమనుకోవాలి, డిపాజిట్‌కు డిసెంబరు నెలాఖరువరకు గడువు ఉందనే ధీమా అంటారా, వారికి డబ్బు అవసరం లేదనుకోవాలా. బినామీలతో విత్‌డ్రా చేయిస్తున్నారనుకోవాలా. అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్ల్లలో ప్రభుత్వ పథకాలపై పడి  ఎడాపెడా దోచుకున్నంతా దోచుకుని దాచుకున్న నేతలంతా ఇప్పుడు వాటిని మార్చుకునే పనిలో పడ్డారని ఆ వర్గాల్లోనే గుసగుసలు వినుపిస్తున్నాయి. 
    – లక్కింశెట్టి శ్రీనివాసరావు 
     
    డబ్బు...డబ్బు...డబ్బు...ఎక్కడ చూసినా...ఏ ఒక్కరిని పలుకరించినా జిల్లాలో మూడు రోజులుగా ఇదే చర్చ. కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేయడంతో దాదాపు అన్ని వ్యవస్థలూ స్తంభించిపోయాయి. బ్యాంకుల్లో చూస్తే సరిపడా నగదు లేదంటున్నారు. ఏటీఎంలకు వెళితే నగదు నిండుకుందనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. సామాన్య జనం తిట్టుకుని వెనుతిరుగుతున్నారు. బ్యాంకులు తెచ్చిన కొత్త నోట్లు అరకొరగానే అందుబాటులోకి రావడంతో సామాన్యులు, మధ్య తరగతి వర్గాలు, రైతులు దైనందిన జీవనంలో నరకం చూస్తున్నారు. బ్యాంకులు నిర్ణయించిన నగదు విత్‌ డ్రా  (రోజుకు రూ.2000లు) కోసం ఈ వర్గాలే క్యూలైన్లలో కనిపిస్తున్నాయి. సమాజంలో డబ్బు వీరికి మాత్రమే అవసరమా. బ్యాంకు, ఏటీఎం వద్ద చూసినా ఈ రెండు వర్గాలే కనిపిస్తున్నాయి.
     
    తెల్లగా చేసేందుకు దేవుడి సన్నిధిలో తమ్ముడి పాట్లు...
    ఖజానా గుప్పెట్లో ఉన్న ఒక పెద్దన్న కూడబెట్టిన కోట్లు సర్థే పని అతని సోదరుడికి పురమాయించాడు. ఆ సోదరుడు అన్న మాట జవదాటకుండా‡ అన్ని పనులూ పక్కనపెట్టేసి ఇప్పుడు దగ్గరుండి నల్లధనాన్ని తెల్లగా చేసే వ్యవహారం చూసుకుంటున్నారట. కొండలపై కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రాన్ని ఇందుకు అడ్డాగా మార్చుకున్నారని భక్తజనం ఆవేదన. ఆ పుణ్యక్షేత్రంలో రెండున్నరేళ్లుగా తన కనుసన్నల్లో నడుస్తున్న కొందరు వ్యాపారులను ఇందుకు పక్కాగా వినియోగించుకున్నారు. వారంతా దేవస్థానానికి జమచేసే సొమ్ములు, ఆలయ కౌంటర్లకు భక్తుల నుంచి వచ్చిన తెల్లనోట్లను తీసుకుని వాటి స్థానంలో అన్నగారి అక్రమార్జనలో కొంత నల్లడబ్బు అరకోటికిపైనే చక్కగా సర్థేశారని కృష్ణానగర్‌ టాక్‌. ఇటు కోనసీమ కేంద్రంలో సామాన్య కార్యకర్త నుంచి చాలా తక్కువ సమయంలోనే ఎకాఎకిన నియోజకవర్గ ముఖ్యుడిగా ఎదిగిన నాయకుడాయన. ఆ నాయకుడు కూడా తన దారికి అడ్డే లేదనే తెగింపు కాస్త ఎక్కువనే చెప్పాలి. తనకంటే బాగా సీనియర్, రక్షక భటులను గడగడలాడించే ఆ నాయకుడు అండదండలు ఎలానూ ఉన్నాయి. ఇంకేముంది తన దారికి అడ్డు లేదని నిశ్చింతగా దోచుకున్న నల్లడబ్బును తెల్లడబ్బుగా మార్చే పనిలో బిజీగా ఉన్నారని అమలాపురంలో బలమైన నోటిమాట నడుస్తోంది. బినామీలుగా ఉన్న అరడజను మంది ప్రధానమైన అనుచరులతో డబ్బు మార్పిడి చేస్తున్నారట. కోనసీమ కేంద్రంలో ఆక్వా రంగ ప్రముఖుల ద్వారా నల్ల ధనాన్ని తెల్లధనంగా మార్చుకునే పనిలో పడ్డారు. కొంత సొమ్మునైతే తన బంధువర్గం వారితో బ్యాంకుల్లో రెండున్నర లక్షలు వంతున వేర్వేరు బ్యాంకుల్లో డిపాజిట్లు చేయించారు. 
    ఇలా ముందు జాగ్రత్తగా..
    ఈస్ట్ర¯ŒS డెల్టా పరిధిలో ఉన్న ముగ్గురు నియోజకవర్గ ముఖ్యనేతల్లో ఇద్దరు మాత్రం బంధువుల పేరుతో నడుస్తున్న రైస్‌ మిల్లింగ్, ఆయిల్‌ మిల్స్‌ లావాదేవీల ద్వారా నల్లడబ్బు ఇప్పటికే చక్కబెట్టేశారట. అందుకే ఏమీ బాదరాబందీ లేనట్టుగా నిశ్చింతగా ఉన్నారంటున్నారు. మరో నియోజకవర్గ ముఖ్యనేతైతే జిల్లాతోపాటు విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో ఉన్న రియల్టర్ల ద్వారా సర్థుబాటు చేసుకునే పనిలో ఉన్నారట. గత నెలలో తనకు తాను అపర భగీరధుడుగా కీర్తించుకున్న మరో నియోజకవర్గ ముఖ్యనేత ‘అసలు ఈ నల్లధనంతో తనకు సంబంధం లేనట్టు,  తన వద్ద అటువంటి పాపపు సొమ్ము లేదన్నట్టు’  ఫోజు పెడుతున్నాడు. అంతలా ధైర్యంగా ఉండటానికి కారణమేమిటా అని ఆరా తీస్తే అక్రమార్జనలో సింహభాగం రియల్‌ ఎస్టేట్, కనస్ట్రక్ష¯ŒS వ్యాపారంలోనే ఉందట. లిక్విడ్‌ కేస్‌ అంతా నాలుగు నెలల క్రితమే ఆ రంగానికి బదిలీ చేశారట. పోర్టు సిటీలో కలిసిమెలిసి ఉన్న రెండు నియోజక వర్గాల ముఖ్య నేతల్లో ఒక నేత నల్లధనం భారీగానే కూడబెట్టాడు. అది ఎలా మార్చాలా అన్న దానిపై తర్జనభర్జనల అనంతరం ఆ సొమ్ము అంతటినీ తన నియోజకవర్గంలో రియల్టర్లకు అప్పగించారు. మరో నియోజకవర్గ నాయకుడైతే తన సోదరుడు అదంతా చక్కబెట్టేస్తుండటంతో హ్యాపీగా ఉన్నారట. ఆ నల్లధనానికి సోదరుడు సముద్ర ఉత్పత్తుల వ్యాపారంలోకి మళ్లించే పనిలో ఉన్నారని తీరంలో తాజా కబురు. రాజమహేంద్రవరంలో ఉన్న మరో ముఖ్యనేత అక్రమార్జనను తాను పెంచి పోషించగా కార్పొరేష¯ŒSలో చక్రం తిప్పుతున్న నాయకుడి ద్వారా దారి మళ్లిస్తున్నారని గుసగుసలు జోరందుకున్నాయి. కొంత మాత్రం తన నుంచి దూరమైన సోదరుడి వ్యాపారంలో పెట్టే ప్రయత్నాల్లో బిజీ అయ్యారట. జిల్లాలో ఒక ముఖ్యనేత ఫో¯ŒSచేసి నల్లడబ్బుకు సేఫ్‌ ప్లేస్‌ చెప్పమని అడగటంతో  నిఘా విభాగంలో పనిచేస్తున్న ఒక అధికారి కంగుతిన్నారట.
     
మరిన్ని వార్తలు