ఖాతాల్లో ఫుల్‌... జేబుల్లో నిల్‌

12 Dec, 2016 15:02 IST|Sakshi
ఖాతాల్లో ఫుల్‌... జేబుల్లో నిల్‌
  • మూడో రోజూ అదే తంతు  
  • వేతన జీవులకు తీరని అవస్థలు
  • పింఛ¯ŒSదారులు తిరుగుముఖం  
  • క్షణాల్లో రూ.140 కోట్లు ఖాళీ
  • సాక్షి ప్రతినిధి – కాకినాడ : 
    ఖాతాల్లో డబ్బున్నా ఖాతాదారులు మాత్రం వంద రూపాయల కోసం కటకటలాడుతున్నారు. చివరకు వేతన జీవులు కూడా జేబులో సరిపడా డబ్బుల్లేక నరకం చూస్తున్నారు. నెలలో ఒకటో తేదీ మొదలై శనివారం నాటికి మూడు రోజులైపోయింది. చేతిలో కనీస ఖర్చులకు డబ్బులు లేక సగటుజీవి సతమతమవుతున్నాడు. జీతాలువిడుదలైనా నాలుగు వేలు మించి చేతిలో పడక ఉద్యోగులు పరిస్థితి దయనీయంగా మారింది. ఒకరోజు కాకపోతే రెండో రోజు అప్పటికీ కాకపోతే మూడో రోజైనా అంతా సర్థుకుంటుందనే ఆశించారు.తీరా శనివారం కూడా నగదు విడుదల్లో పెద్దగా ఎటువంటి మార్పు కనిపించ లేదు. నెల ప్రారంభంలో చెల్లించే ఖర్చులకు చేతిలో సరిపడా డబ్బులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఉదయం నుంచి రాత్రి వరకు బ్యాంకులు, ఏటీఎంల వద్ద బారులుదీరిన వారికి నిరాశే ఎదురైంది. శుక్రవారం రాత్రికి జిల్లాకు వచ్చిన రూ.140 కోట్లు అన్ని బ్యాంకులకు జమ చేశారు. కానీ ఆ సొమ్ము రెండు గంటల్లోనే ఖాళీ  అయిపోయింది.మధ్యాహ్నం 3 గంటల తరువాత దాదాపు జిల్లాలో ఏటీఎంలు, బ్యాంకుల్లో నగదు లేక ఖాతాదారులు, పింఛ¯ŒSదారులు, ఉద్యోగులు ఉసూరుమంటూ వెనుతిరిగారు. శనివారం రాత్రికి రూ.200 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఆ నగదు వస్తే సోమవారం ఉదయం ప్రధాన బ్యాంకులతోపాటు ఏటీఎంలలో పెట్టే ఏర్పాట్లు చేస్తున్నారు. అయినా సమస్య ఇప్పటికిప్పుడు పరిష్కారమై అవసరం మేరకు సొమ్ము లభించే పరిస్థితి లేదని బ్యాంకు వర్గాలే చేతులెత్తేస్తున్నాయి.
    జీతాలు, పింఛన్ల పంపిణీ మొదలైన మూడో రోజు శనివారం కూడా అదే తంతు కొనసాగింది. ఎక్కడా ఏ ఏటీఎంలోను, బ్యాంకులోను డబ్బులు లేవనే సమాధానమే ఎదురైంది. కొంతలో కొంత కనీసం నాలుగైదు వేలైనా దక్కాయని ఉద్యోగులు సరిపెట్టుకుంటున్నారు. మె జార్టీ బ్యాంకుల్లో ఉదయం ప్రారంభమై రెండు గంటల్లోనే నగదు నిండుకోవడం తో జనం నిరాశతో వెళ్లిపోయారు.
    పింఛ¯ŒSదారుల అవస్థలు దయనీయం...
    పింఛ¯ŒSదారులకు రూ.1000, రూ.1500 ఇవ్వాల్సి ఉన్నా రూ.100 నోట్లు కొరత కారణంగా కనీసం పది శాతం మందికి కూడా ఇవ్వలేకపోయారు. ఏజెన్సీలో నేరుగా పింఛ¯ŒSదారుల చేతికే సొమ్ములు ఇస్తామని ప్రకటించినా అది కూడా ఆచరణలో బెడిసికొట్టింది.రూ.100 నోట్లు కొరత, పూర్తి స్థాయిలో బ్యాంకుల్లో నగదు లేకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. సామాజిక భద్రతా పింఛన్లపైనే ఆధారపడ్డ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు రోజు గడిచే పరిస్థితి లేక కన్నీటి పర్యంతమవుతున్నారు. ఏలేశ్వరం ఆంధ్రా బ్యాంకులో పింఛ¯ŒSదారులకు రూ. 1000కి బదులు రూ. 500 ఇవ్వడంతో నిరాశ చెందారు. పింఛ¯ŒSదారుల ఇబ్బందులపై అఖిల భారత మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో మహిళలు ర్యాలీ నిర్వహించే వరకూ వెళ్లింది. గోకవరం కొత్తపల్లికి చెందిన కె.కుమారి బ్రెయి¯ŒSకు ఆపరేష¯ŒS చేయించుకుని మందుల కోసం ఆటోలో రాజమహేంద్రవరం వెళ్లి నిరాశతో ఇంటికి తిరిగి వచ్చేసింది. ఇలా చాలా మంది మందులు, ఇంట్లో పచారీ సరుకులు కొ నుగోలు చేయడానికి చేతిలో డబ్బుల్లేక నానా తంటాలుపడుతున్నారు. ఉదయం బారులుదీరినా బ్యాంకులో నగదు లేక రాజానగరం ని యోజకవర్గంలో చా లా బ్యాంకుల్లో జనం తిట్టుకుంటూ పోయారు.
    అంతటా ఇదే పరిస్థితి...
    ∙తుని, పిఠాపురం నియోజకవర్గాల్లోని బ్యాంకుల్లో అయితే నగదు చెల్లింపులు జరపలేదు. రాజమం డ్రి రూరల్‌లో పింఛ¯ŒSదారులకు బ్యాంకుల్లో పింఛన్లు పడలేదు. + రాజమండ్రి సిటీలో ఏటీఎంలు వద్ద ఉదయం నుంచి రాత్రి వరకు క్యూలై¯ŒSలలో ఉండి రెండు వేలు వంతున తీసుకున్నారు. 
    ∙కాకినాడ సిటీలో ఏటీఎంలలో నగదు లేక ఖాతాదారులు తిరిగి వెళ్ళిపోయారు. బ్యాంకు లో రూ.3 వేలు, రూ.4 వేలు మాత్రమే ఖాతాదారులకు ఇచ్చారు. 
    అమలాపురంలో ఉద్యోగులకు పూర్తిస్థాయిలో నగదు ఇవ్వలేదు. మామిడికుదురు ఎస్‌బిఐలో సాయంత్రం 3 గంటల వరకు రూ.2వేలు నోట్లు ఇవ్వగా, నగదు నిండుకోవడంతో క్యూలో ఉన్న ఖాతాదారులు వెనుతిరిగారు. 
    ఆత్రేయపురం మండలం ర్యాలి ఆంధ్రాబ్యాంకులో పింఛ¯ŒSదారులకు రూ.1000 డిపాజిట్‌ చేస్తే రూ.2 వేలు నోటు ఇస్తామనడంతో నిరాశ చెందారు.  
    మండపేట, పెద్దాపురం, రామచంద్రపురం నియోజకవర్గాల్లో సామాజిక పింఛన్లు అందక వెనుతిరిగి వెళ్లి పోవడంకన్పించింది. ఈ పరిస్థితి ఎప్పటికి మారుతుంది.. తమ కష్టాలు ఎప్పటికి గట్టెక్కు తాయని జనం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.
     
>
మరిన్ని వార్తలు