లక్నవరంలో ‘మూగమనసులు’ షూటింగ్‌

25 Sep, 2016 00:52 IST|Sakshi
లక్నవరంలో ‘మూగమనసులు’ షూటింగ్‌
గోవిందరావుపేట : మండలంలోని లక్నవరం సరస్సు వద్ద మూగమనసులు సీరియల్‌ షూటింగ్‌ శనివారం లక్నవరం సరస్సు వద్ద హీరో ఆదిత్యవర్మ, హీరోయిన్‌ ధరణి, మరికొందరిపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. గగన్‌ టెలిషో సమర్పణలో గుత్తా వెంకటేశ్వరరావు నిర్మిస్తుండగా శ్రావణభాస్కర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్‌ను ఉయ్యాలవంతెన, రెస్టారెంట్‌ వద్ద గార్డెన్‌, బోటుపై వివిధ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా  దర్శకుడు భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ లక్నవరంలో ప్రకృతి అందాలు బాగున్నాయని, వీటిని పరిశీలించి షూటింగ్‌కు ఎంతో మంచి ప్రదేశంగా భావించామని తెలిపారు. ఇప్పటికే 590 ఎపిసోడ్‌లు పూర్తయ్యాయని వివరించారు. ఆదివారం గోవిందరావుపేటలోని కోదండరామాలయంలో షూటింగ్‌ జరుపనున్నట్లు తెలిపారు. బృందంలో ఆర్టిస్టులు సత్తిపండు, ఆకాశ్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత కృష్ణకాంత్‌, రచయిత బీవీ.రామారావు, శ్రీదేవిలు ఉన్నారు. 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు