తొలిరోజే రూ.100 కోట్లకు పైగా కోడిపందాలు

14 Jan, 2016 13:14 IST|Sakshi
తొలిరోజే రూ.100 కోట్లకు పైగా కోడిపందాలు

రాజమండ్రి/ఏలూరు: సంక్రాంతి వచ్చిందంటే భారీ ఎత్తున జూదానికి తెర తొలగిందన్నమాటే. సంకాంత్రి పండగ పర్వదినాల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో ఇష్టారాజ్యంగా కోడిపందాలు శ్రుతి మించిపోతున్నాయి. సంకాంత్రి పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాల్లో కోడిపందాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెం కొయ్యలగూడెలం, జీలుగుమిల్లిలో ఇప్పటికే కోడిపందాలు ప్రారంభమైయ్యాయి. గోదావరి జిల్లాల్లో తొలిరోజే 100 కోట్లకు పైగా పందాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో కోడిపందాలపై ఎలాంటి ఆంక్షలు, నియంత్రణ గానీ విధించినా వాతావరణం కనిపించటలేదు. దాంతో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు దగ్గర ఉండి మరీ పందాలు ప్రారంభిస్తున్నట్టు తెలిసింది. ఆ రెండు జిల్లాల్లో కోడిపందాలను నియంత్రణ చేయలేక ఆఖరికి పోలీసులు కూడా చేతులెత్తేశారు. ఈ పందాలను అరికట్టడానికి అధికారులు, పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకునేందుకు యత్నించినప్పటికీ  వీటిని అడ్డుకోవడంలో విఫలమవుతున్నారు.

మరిన్ని వార్తలు