పట్టపగలే దోచేశారు

31 Jan, 2017 23:49 IST|Sakshi
పట్టపగలే దోచేశారు
పెదపాడు (దెందులూరు): పెదపాడు మండలం ఏపూరు ఫ్లైఓవర్‌ బ్రిడ్జి సమీపంలోని ఓ ఇంట్లో పట్టపగలే దొంగలు పడి 12 కాసుల బంగారు ఆభరణాలు అపహరించారు. పెదపాడు పో లీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఏపూరు ఫ్లైఓవర్‌ బ్రిడ్జి సమీపంలోని సీతారామాంజనేయస్వామి ఆలయం వెనుక ఉన్న పడాల గోపి ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించారు. బీరువాలోని 12 కాసుల బంగారు ఆభరణాలు ఎత్తుకుపోయా రు. బాధితుడు గోపి ఫిర్యాదు మేరకు ఏలూరు రూరల్‌ సీఐ అడపా నాగమురళీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఏఎస్‌ఐ ఎ న్‌ వీ సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు