పెరిగిన బత్తాయి ధర..!

25 Aug, 2016 22:31 IST|Sakshi
పెరిగిన బత్తాయి ధర..!
గుర్రంపోడు : బత్తాయి రైతులకు మంచిరోజులొచ్చాయి. గతంలో పంట ఉంటే ధర లేని..ధర ఉంటే దిగుబడి రాని పరిస్థితులు ఉండేవి. వర్షాభావంతో తగ్గిన తోటల సాగు..పడిపోయిన దిగుబడులతో మార్కెట్‌లో ధర కూడా దోబూచులాడింది. దీంతో  నెల క్రితమే చాలా వరకు బత్తాయి తోటల్లో కాయ కోతలు ముగిసాయి. దీంతో ఇప్పటి వరకు కాయలు కోయని పది నుంచి 20శాతం  తోటలకు మంచి ధర పలుకుతుంది. దళారులు తోటల వద్దకు వచ్చి గతంలో ఎన్నడూ లేనంతగా టన్నుకు రూ25 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. నానా కష్టాలు పడి తోటలను కాపాడుకున్న తమకు ప్రస్తుత ధర ఎంతో ఊరటనిస్తోందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో టన్నుకు రూ.పదివేల లోపు ఉన్న ధర ప్రస్తుతం పెరగడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా బత్తాయి మార్కెట్‌ ప్రధాన కేంద్రాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాల్లోనూ వర్షాకాలం సీజన్‌లో కురిసే వర్షాలపై మార్కెట్‌ ధర ఆధారపడి ఉంటుంది. ఐతే ఎన్నడూ లేనంతగా ఆగస్టులో ఆయా నగరాల్లో వర్షాలు లేక మన బత్తాయి రైతులకు కలిసొచ్చింది. సెప్టెంబర్‌లో టన్నుకు రూ.30 వేల వరకు ఉండవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  
 
మరిన్ని వార్తలు