వైద్యుల నిర్లక్ష్యం తల్లీబిడ్డలను బలిగొంది

4 May, 2016 02:09 IST|Sakshi
వైద్యుల నిర్లక్ష్యం తల్లీబిడ్డలను బలిగొంది

కడుపులోనే బిడ్డ, పరిస్థితి విషమించి తల్లి మృతి
సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రి వద్ద బంధువుల ఆందోళన

హైదరాబాద్ : వైద్యుల నిర్లక్ష్యం తల్లీబిడ్డల ఉసురుతీసింది. కాన్పుకోసం వచ్చిన నిం డు గర్భిణిని ఆసుపత్రిలో చేర్పుకోకుండా తిప్పి పంపడంతో కడుపులోనే శిశువు మృతి చెందగా.. ఆరోగ్యం విషమించి కొన్ని గంట్లోనే తల్లి కూ డా మృత్యువాత పడింది. ఈ విషాద ఘటన సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో జరిగింది. దీంతో మృతుల కుటుం బసభ్యులు ఆసుపత్రి వద్ద మంగళవారం ఆందోళనకు దిగారు.  బాధితుల కథనం ప్రకారం... కందూకూరు మండలం మాదాపూర్‌కు చెందిన శ్రీనివాస్ లారీడ్రైవర్. ఏడాది క్రితం ఇతనికి నాదర్‌గుల్‌కు చెందిన మమతతో పెళ్లైం ది.

మమత గర్భం దాల్చడంతో భర్త ప్రతీనెలా సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్య పరీక్షలు చేయించాడు.  నెలలు నిండడంతో కాన్పు కోసం మమతను సోమవారం ఉదయం ఆస్పత్రికి తీసుకొచ్చాడు. సోమవారం రోగుల తాకిడి ఎక్కువగా ఉండటంతో వైద్యులు మమతను ఆసుపత్రిలో చేర్చుకోకుండా బుధవారం రావాలని చెప్పిపంపేశారు. మంగళవారం తెల్లవారుజామున 1.45కి మమతకు తీవ్రమై కడుపు నొప్పి రావడంతో మళ్లీ  సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతికి తీసుకొచ్చారు.

మమతను పరీక్షించిన వైద్యులు అప్పటికే కడుపులోని శిశువు మృతి చెందినట్టు ధ్రువీకరించారు. మమత పరిస్థితి సైతం విషమించడంతో తెల్లవారుజామున 2.25కి మృతి చెందిం ది.  వైద్యుల నిర్లక్ష్యం వల్లే తల్లీబిడ్డల ప్రాణాలు పోయాయని బంధువులు ఆసుపత్రి వద్ద ధర్నాకు దిగడంతో మూ డు గంటల పాటు తీవ్ర ఉద్రిక్తత నెలకొం ది. ఆస్పత్రికి వచ్చిన రోజే నిండు గర్భి ణి అయిన మమతను ఆసుపత్రిలో చేర్చుకొని ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని వారు రోదించారు. 

సమాచారం తెలుసుకున్న  సుల్తాన్‌బజార్ పోలీసులు ఆస్పత్రిలో భారీగా బలగాలను మోహరించి బందోబస్తు నిర్వహించారు. వైద్యుల నిర్లక్ష్యం ఉంటే తమకు ఫిర్యాదు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు రోగి బంధువులకు న చ్చచెప్పారు.  పోస్టుమార్టం నివేదిక ప్రకారం వైద్యులపై చర్య లు తీసుకుంటామని హామీ ఇచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించడంతో ఆందోళన విరమించారు.

బీపీ వల్లే మమత చనిపోయింది
గర్భిణి మమతకు అధికంగా బీపీ ఉందని, అలాగే ఉపిరితిత్తుల్లో నీరు చేరడంతోనే చనిపోయింది. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరత ఉండటంతో ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై పని ఒత్తిడి బాగా పెరిగింది.  మమత మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని తేలితే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. -డాక్టర్ రత్నకుమారి ఆసుపత్రి సూపరింటెండెంట్

>
మరిన్ని వార్తలు