తల్లిపాలే పిల్లలకు శ్రేయస్కరం

11 Aug, 2016 17:01 IST|Sakshi
తల్లిపాలే పిల్లలకు శ్రేయస్కరం
 

♦  అంగన్‌వాడి కార్యకర్తలకు దీర్ఘకాలిక లక్ష్యాలు అవసరం
♦  పూర్వప్రాథమిక విద్యా ఎంతో అవసరం
♦  తల్లిపాల మాసోత్సవాల్లో పరిగి ఎమ్మెల్యే టీ.రామ్మోహన్‌రెడ్డి

పరిగి: పుట్టగానే ముర్రుపాలతో పాటు తదనంతరం తల్లిపాలు తాగించటం వల్ల దీర్ఢకాలంలో వారి ఎదుగుదలకు దోహదం చేస్తాయని ఎమ్మెల్యే టీ. రామ్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం పరిగిలోని కేఎన్‌ఆర్ గార్డెన్‌లో ఐసీడీఎస్‌ ఆద్వర్యంలో తల్లిపాల మాసోత్సవాల్లో బాగంగా నియోజకవర్గ స్థాయి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ   అంగన్‌వాడి కేంద్రాలు స్వల్పకాలిక లక్ష్యాలను సాధిస్తూనే దీర్ఘకాలిక లక్ష్యాలకోసం  పనిచేయాలన్నారు. పూర్వ ప్రాథమిక విద్య ప్రభుత్వం ప్రవేశపెట్టాలని అయితే అది అంగన్‌వాడి సెంటర్ల ద్వారానే అమలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే సమయంలో పూర్వ ప్రాథమిక విద్య పాఠశాలలకు అనుబందంగా జరగాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.  మాతా శిశు మరణాలను తగ్గించటంలో అంగన్వాడీల పాత్ర ఎంతో కీలకమైనదని ఆయన తెలిపారు. కార్యకర్తలకు నిరంతరం శిక్షణ తోపాటు వారిలో వత్తిడిని తగ్గించేందుకు నిరంతరం ప్రత్యేక కార్యక్రమాలు అవసరమని అధికారులకు సూచించారు.  అంగన్‌వాడి కార్యకర్తల సమస్యలు, పోస్టుల భర్తి తదితర అంశాలు అసెంబ్లీలో చర్చిస్తానని తెలిపారు.

అనంతరం పరిగి జ్యోతి, గండేడ్‌ ఎంపీపీ శాంత మాట్లాడుతూ సమాజాం అంగన్వాడీలను సరియైన విదంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రసవం తల్లికి పునర్‌జన్మ అని  అలాంటి తల్లులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన వ్యవస్థపై ఉ‍ందని పరిగి సర్పంచ్‌ విజయమాల అన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, హెల్త్‌ సబ్‌ సెంటర్లను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే గ్రామ స్థాయిలోనే చాలా రకాల హెల్త్‌ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఎంపీడీఓ విజయప్ప, ఎస్పీ హెచ్‌ఓ డాక్టర్‌ ధశరథ్‌ అన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలతో అంగన్‌వాడి కేంద్రాలు పనిచేస్తున్నాయని సీడీపీఓ ప్రియదర్శిని అన్నారు. తల్లిపాలు పిల్లల పాలిట సంజీవిని అని వివరించారు. చిన్నతనంలో తల్లిపాలు తాగిన చిన్నారుల్లో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్‌వైజర్లు సరళ, ఆదిలక్ష్మి, ప్రమిళ, రాణి, నిర్మళ, దివ్య, నీలవేణి, పద్మ, జ్యోతి, కాంగ్రెస్‌ నాయకులు టీ. వెంకటేష్‌, అశోక్‌రెడ్డి అంగన్వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న స్టాళ్లు.
అంగన్వాడి కార్యకర్తలు ఊర్పాటు చేసిన స్టాళ్లు ఆకట్టుకున్నాయి. ఇందులో బాగంగా అంగన్వాడి కార్యకర్తలు చిన్నారులకు చిన్నతనంలో ఆటల కోసం, సృజనాత్మకతను పెంచేందుకు వినియోగించే పరికరాలు, వస్తులు అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లలో ప్రదర్శించారు. తీసుకోవాల్సిన ఆహార పధార్థాల తయారు చేసి స్టాళ్లలో ఉంచారు వాటివల్ల కలిగే ఉపయోగాలను అక్కడ రాసి ఉంచారు. ఆరోగ్యం కోసం  తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబందించిన  పరికరాలు ప్రదర్శించారు.

మరిన్ని వార్తలు