మొరాయిస్తున్న మోటార్లు!

6 Aug, 2016 22:53 IST|Sakshi
మొరాయిస్తున్న మోటార్లు!
నాగయ్య అనే రైతుది దోమకొండ మండలం అంబారీపేట గ్రామం. ఆయనకు మూడెకరాల పొలం ఉంది. బోరుపై ఆధారపడి సేద్యం చేస్తున్నాడు. రెండేళ్లుగా సరైన వర్షాల్లేక ఇబ్బందులు పడ్డ నాగయ్య.. ఇటీవల కురిసిన వర్షాలతో పొలంబాట పట్టాడు. కొంతభాగం నాటు కూడా వేశాడు. అంతలోనే బోరు మోటారు పాడైంది. వెయ్యి రూపాయల వరకు కూలీ చెల్లించి మోటారునుపైకి తీయించాడు. మోటారు వైండింగ్‌తో పాటు బేరింగులు చెడిపోయాయని మెకానిక్‌ చెప్పడంతో మరమ్మతులు చేయించాడు. మరమ్మతులకు రూ. 3,900 అయ్యాయి. తిరిగి మోటారును బిగించడం, ఇతర ఖర్చులన్నీ కలిపి మరో రూ. వెయ్యి అయ్యాయి. అంటే మోటారు, పంపు బాగుకు పంట సాగు మొదట్లోనే అయిన ఖర్చు రూ. 5,900. మోటారు ఎంత కాలం నడుస్తుందో, నీరు ఎంత పోస్తుందో తెలియదు. ఇది ఒక్క నాగయ్య పరిస్థితే కాదు.. బోర్లపై ఆధారపడ్డ రైతులందరూ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 
 
కామారెడ్డి : రెండేళ్ల కరువుతో అతలాకుతలమైన రైతాంగం ఇటీవల కురిసిన ఓ మోస్తారు వర్షాలతో ఖరీఫ్‌ సాగుపై ఆశలు పెంచుకున్నారు. దీంతో పొలంబాట పట్టిన రైతులు బోర్లలో నీటి ఊట పెరిగిందేమోనని మోటార్లను ఆన్‌ చేస్తే అవి మొరాయిస్తున్నాయి. దీంతో మోటార్లను పైకి తీసి మరమ్మతులు చేయించాల్సి వస్తోంది. జిల్లాలో లక్షా 45 వేల బోరుబావులు ఉన్నాయి. అనధికారికంగా మరో ఇరవై వేల దాకా ఉంటాయి. అయితే చాలా ప్రాంతాల్లో గత రెండుమూడేళ్లుగా సరైన వర్షాలు లేకపోవడంతో భూగర్భజలాలు అడుగంటిపోయి బోర్లు మూలనపడ్డాయి. అప్పటి నుంచి బోరు మోటార ్లను నడిపించలేకపోయారు. ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షాలతో కొంతమేర బోర్లు పోసే అవకాశం ఉండడంతో రైతులు బోర్లను స్టార్ట్‌ చేయడం, అవి మొరాయిస్తుండడంతో మరమ్మతుల కోసం మెకానిక్‌లను ఆశ్రయిస్తున్నారు. 
ఒక్కో మోటారు మరమ్మతుకు రూ. 5 వేల పైనే
చాలా కాలంగా నీళ్లు లేక బోర్లలోనే ఉన్న బోరు మోటారు, పంపులను పైకి తీయడానికి గాను తక్కువలో తక్కువ రూ. వెయ్యి వరకు ఖర్చు చేస్తున్నారు. మోటారు వైండింగ్, పంపులో బేరింగులు, ఇతర మరమ్మతులు, అలాగే స్టార్టర్‌ బాక్సుల మరమ్మతులకు మరో రూ. 4 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు తెలిపారు. మెకానిక్‌ షెడ్ల వద్దకు నిత్యం పదుల సంఖ్యలో మోటార్లు మరమ్మతుల కోసం వస్తుండడంతో మెకానిక్‌లు రాత్రింబవళ్లు మరమ్మతు పనులు చేస్తున్నారు. 
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

కూతురి పెళ్లికి అప్పు దొరక్క తండ్రి ఆత్మహత్య

ముంపు..ముప్పు..

మత సామరస్యానికి ప్రతీక అబ్బాస్‌ దర్గా

'పెట్టె' ఫలితమివ్వలే!

తప్పుడు లెక్కలు చెబితే చర్యలు

దోమ కాటు.. కాలుష్యం పోటు

మద్యంపై పోరాటానికి మద్దతు ఇవ్వండి

విద్యాశాఖ నిర్లక్ష్యంతో కుమారుడిని పోగొట్టుకున్నా..

వృద్ధ దివ్యాంగులకు మోటారు వాహనాలివ్వండి..

బ్యారన్‌లు ముంచేశాయి

కిడ్నీలు పనిచేయడం లేదన్నారయ్యా!

అర్హత ఉన్నా పింఛన్‌ ఇవ్వడం లేదు

కుటుంబ పోషణ భారంగా ఉంది

ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వడంలేదు:

జగనన్న పేరు పెట్టడం సంతోషంగా ఉంది

వ్యాపారులకు కొమ్ముకాస్తోంది

ముస్లింలను ఆదుకోవాలి

ఫ్లోరైడ్‌ నీరు ప్రాణాలు తీస్తోంది

కేబుల్‌ ఆపరేటర్లకు అన్యాయం చేయొద్దు

అధికారిక దోపిడీ

బ్యాడ్మింటన్‌ ఆడుతూ కానరాని లోకాలకు..

మీటరు వడ్డీతో అల్లాడిపోతున్నాం..!

పశువుల లెక్క పక్కాగా

దాహం తీర్చేదెలా?

ఏమంటాం..ఇష్ట‘పడక’!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!