పాఠశాల కొనసాగించాలని ఎమ్మార్సీకి తాళం

13 Jun, 2017 22:04 IST|Sakshi
పాఠశాల కొనసాగించాలని ఎమ్మార్సీకి తాళం

గుడిబండ (మడకశిర) : తమ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలను కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ మండల పరిధిలోని ముత్తుకూరు గ్రామస్తులు మంగళవారం గుడిబండ ఎమ్మార్సీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఆ పాఠశాల ప్రభుత్వ రేషనలైజేషన్‌లో మూసివేశారు. అయితే పాఠశాల కొనసాగించాలంటే 30మంది విద్యార్థులు ఉండాలి. కానీ ఈ పాఠశాలకు 6,7వ తరగతులకు సంబంధించి కేవలం 25మందే ఉన్నారు. దీంతో పాఠశాల మూసివేస్తే తమ పిల్లలు సమీపంలోని పాఠశాలకు దాదాపు 2కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తుందని గ్రామస్తులు మండిపడ్డారు. కనుక పాఠశాలను కొనసాగించాలని కోరారు. ఎంఈఓ అందుబాటులో లేకపోవడంతో ఎంపీడీఓకు వినతిపత్రం ఇచ్చారు. ఇందుకు ఎంపీడీఓ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో శీనానాయక్, భీమారెడ్డి, కరిబసయ్య, నగేష్, భీమరాజు, బసవరాజు, నరసయ్య, హనుమంతు, శీను తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు