ఎంఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడి

2 Aug, 2016 23:28 IST|Sakshi
ఎంఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడి
హన్మకొండ అర్బన్‌ :  ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలో ఎమ్మార్పీఎస్‌ తలపెట్టిన ఆందోళనకు మద్దతుగా ఎంఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టడంపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాలని విద్యార్థి నాయకులు డిమాండ్‌ చేశారు. దీనిపై సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలన్నారు. అంతకుముందు బాలసముద్రంలోని ఏకశిలాపార్క్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట విద్యార్థులు ధర్నాకు దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థి నాయకులను అరెస్టు చేశారు. ఈక్రమంలో కొద్దిసేపు విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనలో  సంఘం జిల్లా అధ్యక్షుడు బుర్రి సతీష్, నాయకులు ఉపేందర్, మంద భాస్కర్, సుకుమార్,శేఖర్, శిరీష, మాసన, స్వప్న తదితరులు పాల్గొన్నారు. 
>
మరిన్ని వార్తలు