ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పరిశీలన

21 Jan, 2017 22:43 IST|Sakshi
ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పరిశీలన
ముచ్చుమర్రి(పగిడ్యాల): మండల పరిధిలోని పాతముచ్చుమర్రిలో చేపట్టిన ఎత్తిపోతల   ప్రాజెక్ట్‌ను కృష్ణానది జలాల బోర్డు చీఫ్‌ ఇంజినీర్‌ విజయ్‌కుమార్‌ నాగ్‌పురే  శనివారం పరిశీలించారు. నాలుగు రోజుల క్రితం కృష్ణాబోర్డు కమిటీ బృందం సందర్శించి టెలిమెట్రీ డిశ్చార్జ్‌ మీటర్ల ఏర్పాటుపై జలవనరులశాఖ, కేసీ కాలువ నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షలు జరిపారు. అయితే ఆ రోజు చీకటిపడటంతో   టెలిమెట్రీ మీటర్ల ఏర్పాటుపై అవగాహనకు రాలేని బోర్డు చీఫ్‌ ఇంజినీర్‌ రెండో విడతగా శనివారం ప్రాజెక్ట్‌ను సందర్శించి క్రాస్‌ రెగ్యూలేటర్‌ వద్ద ఉండే డిశ్చార్జ్‌ పాయింట్‌ను, వాల్వ్‌ ప్రదేశాలను పరిశీలించారు.  కార్యక్రమంలో కృష్ణాబోర్డు సభ్యుడు చీఫ్‌ ఇంజినీర్‌ ఏ. బాలన్, డిప్యూటీ డైరక్టర్‌ ఆనంద్‌కుమార్, జలవనరుల శాఖ డీఈ ఆదిశేషారెడ్డి తదితరులు ఉన్నారు. 
 
మరిన్ని వార్తలు