ముదిరాజ్‌ల సమస్యల పరిష్కారానికి కృషి

12 Dec, 2016 15:05 IST|Sakshi
ముదిరాజ్‌ల సమస్యల పరిష్కారానికి కృషి

డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తా
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న

 
 ఆదిలాబాద్ రూరల్ : రాష్ట్రంలో ముదిరాజ్‌ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ముదిరాజ్‌లు నిర్వహించిన చలో హైదరాబాద్ ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి చేర్చడానికి తన వంతుగా సీఏం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీనిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ముదిరాజ్‌లు ఎంతో కృషి చేశారని, రాష్ట్రంలోని 86 ముదిరాజ్‌లు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని గుర్తు చేశారు.

బీసీల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని బీసీ కమిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతకు ముందు పార్క్‌లో ఉన్న ముదిరాజ్‌ల ఆరాధ్యదైవం భీమన్న దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్, మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీష, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లోకా భూమారెడ్డి,  ముదిరాజ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండ ప్రకాష్, జిల్లా నాయకులు శ్రీనివాస్, శంకర్, మల్లేష్, రమేష్, శివ్వయ్య, తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు