రాజకీయ పార్టీ పెట్టేంత పెద్దోడ్ని కాదు:ముద్రగడ

27 Feb, 2016 18:12 IST|Sakshi
రాజకీయ పార్టీ పెట్టేంత పెద్దోడ్ని కాదు:ముద్రగడ

గుంటూరు : తాను రాజీకయ పార్టీ పెట్టే అంత పెద్దవాడిని కాదని కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ ...'నాపై అభిమానానికి రాంగోపాల్ వర్మకు ధన్యవాదాలు. 'వంగవీటి' సినిమా తీయడానికి నా అనుమతి అక్కర్లేదు. ఏదైనా అభ్యంతరం ఉంటే రంగా కుటుంబమే అభ్యంతరం వ్యక్తం చేయాలి. నా భార్యతో  సహా నా జీవితం కాపు జాతికి అంకితం.
చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను  మాత్రమే అమలు చేయమని కోరుతున్నాం. మాది గొంతెమ్మ కోర్కే  కాదు.  దీక్ష విరమణ సమయంలో నిధుల  విషయంలో ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా రుణాల కోసం తక్కువ నిధులు  కేటాయించింది.
 
తుని ఘటనకు  కర్త, కర్మ, క్రియా నేనే, ఈ విషయంలో రాష్ట్రంలోని కాపు జాతిని కేసులతో ఇబ్బంది పెట్టవద్దు. పోలీసులు ఏ జైలుకు రమ్మన్న వస్తా, అరెస్టు చేస్తే బెయిల్ కూడా తీసుకోను. రిజర్వేషన్లు సాధించేవరకు  నేను నిద్రపోను, కాపు జాతి కూడా నిద్రపోవద్దు. నీ అందరికి నేను అండగా ఉంటాను' అని అన్నారు. కాగా తాను రాజకీయాలు, ప్రజా సంక్షేమంపై నమ్మకం లేదని... ఒకవేళ ముద్రగడ పార్టీ పెడితే ఆ పార్టీలో చేరతానని ప్రముఖ దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు