కోనసీమ ముఖద్వారం ఖాకీమయం

23 Jan, 2017 22:51 IST|Sakshi
కోనసీమ ముఖద్వారం ఖాకీమయం
  • ముందస్తుగా బందోబస్తు
  • భారీగా మోహరించిన పోలీసు బలగాలు
  • పోలీసు ఉన్నతాధికారుల సమీక్షలు
  • జాతీయ రహదారిపై కవాతు
  • అనంతపురం నుంచి వాటర్‌ కెనా¯ŒS వాహనం రాక
  • కాపు సత్యాగ్రహ పాదయాత్ర జరిపి తీరతామని కాపు వర్గీయులు, అడుకుంటామని పోలీసులు. దీంతో భారీ బందోబస్తు ఏర్పాటుతో కోనసీమ ముఖద్వారమైన రావులపాలెం ఖాకీమయంగా మారింది. పలువురు పోలీసు ఉన్నతాధికారులు రావులపాలెం వచ్చి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సెక్ష¯ŒS–30 పోలీస్‌యాక్ట్‌ అమలులో ఉందని ఎలాంటి సభలు సమావేశాలు నిర్వహించకూడదని పోలీసులు చెబుతున్నారు.  
    – రావులపాలెం (కొత్తపేట)
     
    కాపు రిజర్వేషన్ల కోసం మాజీ మంత్రి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం రావులపాలెం నుంచి ఈ నెల 25న కాపు సత్యాగ్రహ పాదయాత్ర చేపట్టనుండటంతో పోలీసులు ముందస్తుగా భారీ బలగాలను మోహరిస్తున్నారు. సోమవారం నాటికి సుమారు 500 మంది పోలీసులు వివిధ ప్రాంతాల నుంచి రావులపాలెం చేరుకున్నారు. వీరిలో వివిధ జిల్లాలకు చెందిన డీఎస్పీ, సీఐలు, ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, హెచ్‌సీలు, కానిస్టేబుళ్ళు, ఏపీఎస్‌పీ స్పెషల్‌ పార్టీ, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ ఫోర్స్‌ పోలీసులు ఉన్నారు. అంతేకాకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఆందోళన కారులను చెదరగొట్టేందుకు అనంతపురం నుంచి వాటర్‌ కెనా¯ŒS వాహనాన్ని ఇప్పటికే రావులపాలెంలో సిద్ధంగా ఉంచారు. కాగా ఏలూరు రేంజ్‌ డీఐజీ పీవీ రామకృష్ణ , జిల్లా అదనపు ఎస్పీ ఏఆర్‌ దామోదర్, అమలాపురం డీఎస్పీ ఎల్‌.అంకయ్య తదితర పోలీస్‌ ఉన్నతాధికారులు రావులపాలెం పోలీస్‌స్టేçÙ¯ŒSలో పరిస్థితిని సమీక్షించారు. డీఐజీ రామకృష్ణ స్టేష¯ŒSలో ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. ప్రస్తుతం సెక్ష¯ŒS–30 పోలీస్‌యాక్ట్‌ అమలులో ఉందని ఎలాంటి సభలు సమావేశాలు నిర్వహించకూడదని డీఎస్పీ అంకయ్య తెలిపారు.
    పోలీసుల కవాతు 
    రావులపాలెం చేరుకున్న వివిధ పోలీస్‌ బలగాలతో సోమవారం సాయంత్రం జిల్లా అదనపు ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై కవాతు నిర్వహించారు. ఇప్పటికే పోలీసులు మండలంలో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి 144 సెక్ష¯ŒS, 30 పోలీస్‌యాక్ట్‌ అమలులో ఉన్నందున ఎలాంటి సభలు సమావేశాలు ఆందోళనలు, ర్యాలీలుచేపట్టరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ముద్రగడ పాదయాత్ర ప్రారంభిస్తారని చెప్పుతున్న కళావెంకట్రావు సెంటరులో ముద్రగడ ఫొటోలతో పాదయాత్రకు సంబంధించి ఫ్లేక్సీలు భారీగా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే 25 నుంచి ముద్రగడ పాదయాత్రకు సంబంధించి కాపు జేఏసీ నాయకుడు ఆకుల రామకృష్ణ  స్థానిక శ్రీకృష్ణదేవరాయ కాపు కల్యాణ మండపంలో కాపు నేతలతో సమాలోచనలు చేశారు.
      
    నేడు రావులపాలెంకు ముద్రగడ
    జగ్గంపేట : కాపు సత్యాగ్రహ యాత్రకు మాజీ మంత్రి, ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మంగళవారం సాయంత్రం తన నివాసం నుంచి రావులపాలెంకు పయనమవ్వనున్నారు. రావులపాలెం నుంచి బుధవారం ఉదయం  పాదయాత్ర ప్రారంభించేందుకు ముందు రోజే ముద్రగడ అక్కడకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు అనుచరులు తెలిపారు.
     
    మూడు వేల మందితో పోలీస్‌ బందోబస్తు
    అంబాజీపేట (పి.గన్నవరం) : కోనసీమ డివిజ¯ŒS పరిధిలో మూడు వేల మంది పోలీస్‌లతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు అమలాపురం డీఎస్పీ ఎల్‌.అంకయ్య తెలిపారు. బుధవారం నుంచి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపు సత్యాగ్రహ పాదయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో సోమవారం స్థానిక పోలీస్‌ స్టేష¯ŒSలో ఆయన సమీక్షించారు. అనంతరం డీఎస్పీ విలేకర్లతో మట్లాడుతూ ఈ పాదయాత్రకు సంబంధించి అనుమతి కోరుతూ ఎలాంటి దరఖాస్తు రాలేదన్నారు. రావులపాలెం, అంబాజీపేట, కొత్తపేట, అమలాపురం, అల్లవరం, రాజోలు, మలిక్కిపురం, పి.గన్నవరం, ముమ్మిడివరం తదితర మండలాల పోలీస్‌ స్టేష¯ŒSలకు 150 మంది కానిస్టేబుల్స్‌తో బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. సెక్ష¯ŒS 30, 144 అమలులో ఉందని గ్రామాల్లో ఎటువంటి సభలు, సమావేశాలు, గుంపులుగా తిరగవద్దని డీఎస్పీ సూచించారు. కోనసీమలో డ్రో¯ŒSలు, కెమెరాలు, షాడో టీంలు గస్తీ నిర్వహిస్తున్నారన్నారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎస్‌ఐ ఆర్‌.భీమరాజు డీఎస్పీ వెంట ఉన్నారు.
     
మరిన్ని వార్తలు