సేవకు ప్రతి రూపం నర్సింగ్‌

12 Aug, 2016 00:43 IST|Sakshi
సేవకు ప్రతి రూపం నర్సింగ్‌
 
  • జేసీ ఇంతియాజ్‌ అహ్మద్‌
నెల్లూరు(అర్బన్‌): సేవలకు ప్రతిరూపమే నర్సింగ్‌ వృత్తి అని జాయింట్‌ కలెక్టర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌ అన్నారు. స్థానిక సంతపేటలోని జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో గురువారం మల్టీ పర్పస్‌ హెల్త్‌ వర్కర్స్‌ స్త్రీల టైనింగ్‌ కోర్సుల ఎంపికకు కౌన్సిలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఈ కోర్సులో చేరేందుకు ప్రభుత్వ, మేనేజ్‌మెంట్‌ కోర్సులకు సంబంధించి 51 మంది మహిళలు దరఖాస్తు చేసుకోగా 26 మంది ఎంపికయ్యారని తెలిపారు. ఎంపికైన వారు తమ చదువులు పూర్తి చేసుకుని భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన సేవలందించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ వరసుందరం, ఏఓ సాయిరాం, అసిస్టెంట్‌ సోషల్‌ వెల్‌ఫేర్‌ ఆఫీసర్‌ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు