‘ములుగు’ను పరిగణనలోకి తీసుకోవాలి

5 Aug, 2016 00:32 IST|Sakshi
  •  సీఎస్‌ రాజీవ్‌శర్మకు మంత్రి చందూలాల్‌ వినతి 
  • ములుగు :  నూతన జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ములుగు జిల్లా అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు వినతిపత్రం అందించారు. గురువారం హైద్రాబాద్‌లోని సీఎస్‌ కార్యాలయంలో ఆయనను కలిసి ములుగు జిల్లా మ్యాప్‌ను వివరించారు. జిల్లా కేంద్రం ఏర్పాటుకు అనుకూలమైన ప్రభుత్వ స్థలాలు, మౌలిక సదుపాయాలు, భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వివరించారు. ములుగును సమ్మక్క–సారలమ్మ దేవతల పేరిట జిల్లా కేంద్రంగా చేయాలని నియోజకవర్గ ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారని అన్నారు. గిరిజన ఆదివాసీల మనోభావాలకు అనుగుణంగా ములుగు, భూపాలపల్లి, పరకాల, నర్సంపేట, భద్రాచలం నియోజకవర్గాల్లోని 21 మండలాలను కలుపుతూ ములుగు కే ంద్రంగా జిల్లాగా చేస్తే ఆమోదయోగ్యంగా ఉంటుందన్నారు. త్వరలో కేసీఆర్‌కు కూడా వినతిపత్రం అందించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట నాయకులు బండారి మోహన్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.  
మరిన్ని వార్తలు