గుట్టు విప్పిన మట్టి గుడ్డ

12 Dec, 2016 14:57 IST|Sakshi
సాక్షి, కామారెడ్డి : సంఘటన స్థలంలో లభించిన చిన్న ఆధారం.. హత్య కేసు ఛేదనకు దోహదపడింది. రెండున్నరేళ్ల క్రితం కుటుంబ పెద్దను హత్య చేసిన కుటుంబ సభ్యులను కటకటాలపాలు చేసింది. ఈ ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది. కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం ఎస్పీ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.  
 
 వివరాలు ఇలా ఉన్నాయి.. 
 నవంబర్ 7 సాయంత్రం 6.30 గంటలు.. కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ‘‘అడ్లూర్ శివారులో గుర్తు తెలియని వ్యక్తిని చంపి దహనం చేశారు’’ అని అవతలి వ్యక్తి సమాచారం ఇచ్చాడు. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి విచారణ ప్రారంభించారు. అయితే ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. చనిపోయింది ఎవరో తెలియదు. హత్య కు గురైంది ఆడో, మగో కూడా నిర్ధారించుకోలేని పరిస్థితి. ఎస్పీకి సమాచారం ఇచ్చారు. ఎస్పీ శ్వేతారెడ్డి, డీఎస్పీ భాస్కర్ సంఘట న స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. క్లూస్ టీంను రంగంలోకి దింపినా లాభం లేకపోయింది. హత్యకు గురైంది మహిళే అని వైద్యులు తెలిపారు. 
 
 దీంతో హత్య కేసును తేల్చేందు కు ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ భాస్కర్ ఆధ్వర్యంలో పోలీసులు మూడు బృందాలు రంగంలోకి దిగారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, ఇరుగు పొరుగు జిల్లాల్లో మిస్సింగ్ కేసులను పరిశీలించారు. అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ అదృశ్యంపై కూపీలాగారు. ఆమె వాడిన సెల్‌ఫోన్ నంబర్ల ద్వారా విచారణ జరిపారు. ఆ ప్రాంతంలో దహనం అయిన రోజున సెల్‌టవర్ లొకేషన్‌లో తిరిగిన వ్యక్తులపై నిఘా పెట్టారు. ఎన్ని రకాలుగా వెతికినా ఎలాంటి క్లూ దొరకలేదు. పలుమార్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు అక్కడ ఓ మట్టితో ఉన్న వస్త్రం కనిపించింది.
 
  దాన్ని పరిశీలించిన పోలీసులు.. ఎక్కడో పాతిపెట్టిన శవాన్ని తెచ్చి దహనం చేసి ఉంటారని అనుమానించారు. కామారెడ్డి బీడీ వర్కర్స్ కాలనీ, డ్రైవర్స్ కాలనీ, గుమస్తా కాలనీ, బతుకమ్మకుంట కాలనీల్లో పోలీసులు ఇంటింటికీ తిరిగి.. ‘ఈ ప్రాంతంలో ఎవరైనా కనిపించకుండా పోయారా’ అని ఆరా తీశారు. గుమస్తా కాలనీకి చెందిన భూక్య శంకర్ (55) రెండున్నరేళ్లుగా కనిపించడం లేదని స్థానికులు తెలపడంతో.. పోలీసులు అతడి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించారు. తీగలాగితే దొంక కదిలింది. హత్యకు గురైంది శంకర్ అని, అతడిని కుటుంబ సభ్యులే చంపారని తేలింది. 
 
 మరుగుదొడ్డి నిర్మించుకునే క్రమంలో..
 గుమస్తా కాలనీకి చెందిన శంకర్‌కు భార్య గంగవ్వ, ఇద్దరు కూతు ళ్లు, కుమారుడు ఉన్నారు. శంకర్ రైస్‌మిల్లులో కార్మికుడిగా పనిచేసేవాడు. అతడికి మద్యంతో పాటు ఇతర దురలవాట్లున్నాయి. ఇంటి అవసరాలకు డబ్బులు ఇవ్వకుండా తాగుతూ, వివాహేతర సంబంధాలు నెరపడంతో పాటు, భార్య, పిల్లలను వేధించేవాడు. దీంతో శంకర్‌ను హతమార్చాలని భార్య, కుమారుడు, అ ల్లుడు పథకం పన్నారు. 2014 మార్చిలో ఓ రోజు అతిగా మద్యం తాగి ఇంటికి వచ్చిన శంకర్‌కు కుటుంబ సభ్యులు మళ్లీ మద్యం తాగించారు. నిషాలో ఉన్న శంకర్ తలపై కర్రలతో బాది చంపా రు. అనంతరం ఇంటి ఆవరణలో మరుగుదొడ్డి కోసం తవ్విన గుంతలో మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. శంకర్ కనిపించడం లేద ని ఎవరైనా అడిగితే దుబాయికి వెళ్లాడని చెప్పారు. 
 
 అయితే ఇటీవల మరుగుదొడ్డి నిర్మించుకోవాలని భావించిన శంకర్ కుటుంబ సభ్యులు.. ఇంటి ఆవరణలో ఎక్కువ స్థలం లేకపోవడంతో మృ తదేహాన్ని పాతిపెట్టిన చోటనే మరుగుదొడ్డి నిర్మించుకోవాలని నిర్ణయించారు. అస్తిపంజరాన్ని వస్త్రంలో చుట్టి అడ్లూర్ శివారు ప్రాంతానికి తీసుకెళ్లి ఖాళీగా ఉన్న నీళ్ల కుండీలో వేసి కిరోసిన్ పోసి దహనం చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపిన పోలీసు లు.. సంఘటన స్థలంలో లభించిన మట్టి గుడ్డ ఆధారంగా ముం దుకెళ్లి కేసును ఛేదించారు. క్షణికావేశంలో చేసిన హత్య రెండున్నరేళ్ల తరువాత కూడా ఆ కుటుంబాన్ని జైలుపాలు చేసింది.
   
 నిందితులు..
 శంకర్ హత్య కేసులో ఆయన భార్య గంగవ్వ(46), కొడు కు భూక్య అర్జున్(20), అల్లుడు గుగులోత్ కిషన్ (45)లపై కేసు న మోదు చేశామని, గంగవ్వ, కిషన్‌లను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్టు ఎస్పీ వివరించారు. కేసును డీఎస్పీ భా స్కర్ ఆధ్వర్యంలో, సీఐ కోటేశ్వర్‌రావు, ఎస్సై సంతోష్‌కుమార్‌ల తో పాటు హెడ్ కానిస్టేబుల్ నరేందర్‌రెడ్డి, కానిస్టేబుళ్లు నర్స య్య, గణపతిలు ప్రత్యేక చొరవ తీసుకుని పరిశోధనలో పాల్గొన్నారని పేర్కొన్నారు. కేసును చేధించడంలో ప్రతిభ చూపిన కానిస్టేబుల్ గణపతికి ఎస్పీ నగదు బహుమతి అందజేశారు. 
 
మరిన్ని వార్తలు