హత్యకేసులో నలుగురికి జీవిత ఖైదు

18 Apr, 2017 02:19 IST|Sakshi
ఏలూరు (సెంట్రల్‌): ఆస్తి కోసం ఒంటరిగా ఉన్న మహిళ ఇంటికి నిప్పు పెట్టి హత్య చేసిన కేసులో నలుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి సోమవారం తీర్పు చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాటపర్రు గ్రామంలోని రామాలయం వీధిలో నివాసముండే గంటా పార్వతి అనే మహిళ వెంకట్రావు అనే వ్యక్తిని దత్తత తీసుకుంది. అతడి భార్య సరోజిని అత్త పార్వతిని ఇంటి నుంచి వెళ్లిపోమ్మనగా ఆమె నిరాకరించింది. దీంతో 2013 జనవరి 3న పార్వతి ఇంట్లో ఒంటరిగా ఉండగా సరోజిని, వెంకట్రావు, మరికొందరు కలిసి ఆమె ఇంటికి నిప్పు పెట్టారు. స్థానికులు మంటలను అదుపుచేసి గాయాలైన పార్వతిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పార్వతి మృతిచెందింది. పార్వతి ఫిర్యాదు మేరకు ఏలూరు రూరల్‌స్టేషన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో గంటా సరోజిని, వెంకట్రావు, చాటపర్రు గ్రామానికి చెందిన అనమిల్లి నాగమణి, వీరవాసరం గ్రామానికి చెందిన కొల్లు వెంకటేశ్వరరావుకు జీవిత ఖైదు, ఒక్కొక్కరికీ రూ.1,000 జరిమానా విధిస్తూ ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఎస్‌.శ్రీదేవి తీర్పు చెప్పారు.  
 
మరిన్ని వార్తలు