ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

23 Jan, 2017 22:07 IST|Sakshi
ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

నిర్మల్‌ టౌన్  : వాహనచోదకులు వాహనాన్ని జాగ్రత్తగా నడపాలని సీఐ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. 28వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ఆదివారం పోలీసుల ఆధ్వర్యంలో వాహనాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ మినీస్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఐ మాట్లాడారు. వాహనచోదకులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని కోరారు. కార్లు, జీపులు నడిపేవారు తప్పనిసరిగా సీట్‌బెల్టులను ధరించాలన్నారు. లైసెన్స్  లేనిదే వాహనాన్ని నడపరాదని సూచించారు. వాహనాన్ని ఎప్పుడూ కండిషన్ లో ఉంచుకోవాలని కోరారు. మద్యం తాగి వాహనాలను నడిపితే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ట్రాఫిక్‌ ఎస్సై చంద్రశేఖర్, వాహనాల డ్రైవర్లు, తదితరులు పాల్గొన్నారు.    

లక్ష్మణచాంద: వాహనదారులు సీట్‌బెల్టు ధరించి వాహనాలు నడపాలని ఎస్సై మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పొట్టపెల్లిలో ఎస్సై మాట్లాడుతూ ప్రతీ వ్యక్తి రోడ్డు నియమాలను పాటిస్తే చాలామట్టుకు ప్రమాదాలు జరగవన్నారు. ఈ కార్యక్రమంలో  పీసీలు నరేశ్, రమేశ్, యాస్మిన్ , వాహనదారులు పాల్గొన్నారు.

నర్సాపూర్‌(జి)(దిలావర్‌పూర్‌): మండలంలోని టెంబుర్నిలో నర్సాపూర్‌(జి) పోలీసుల ఆధ్వర్యంలో సర్పంచ్‌ ఏలేటి కండెల లక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎస్సై రాంనరసింహారెడ్డి రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు సాయారెడ్డి, ప్రకాశ్, మెంచు పోశెట్టి, గంగయ్య, పోలీసు సిబ్బంది మహిపాల్‌రెడ్డి, వర్మ, మన్సూర్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు