దేవుడిచ్చిన వరం..!

2 May, 2017 01:03 IST|Sakshi
దేవుడిచ్చిన వరం..!

నిజామాబాద్‌ కలెక్టర్‌గా పనిచేయడం నా అదృష్టం
జాతీయ అవార్డుతో మరింత బాధ్యత పెరిగింది
సమష్టి కృషి వల్లే సాధ్యమైంది
అవార్డు రైతులకు అంకితం కలెక్టర్‌ యోగితా రాణా
ప్రగతిభవన్‌లో కలెక్టర్‌ను ఘనంగా సన్మానించిన జిల్లా యంత్రాంగం


ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌) : నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా పని చేయడం తనకు దేవుడిచ్చిన వరమని కలెక్టర్‌ యోగితారాణా అన్నారు. 11వ సివిల్‌ సర్వీసెస్‌ దినోత్సవం సందర్భంగా ఈ–నామ్‌ అమలుపై ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘ప్రధాన మంత్రి విశిష్ట ఉత్తమ సేవా’ అవార్డును అందుకోవడం ద్వారా మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఏప్రిల్‌ 21న ఢిల్లీలో అవార్డును పొందిన అనంతరం కలెక్టర్‌ యోగితా రాణా పది రోజుల తరువాత సోమవారం జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం కలెక్టర్‌ను ఆహ్వానించి ఘనంగా సన్మానించింది. జాయింట్‌ కలెక్టర్‌ రవీందర్‌ రెడ్డి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాహుల్‌ రాజ్, ఇన్‌చార్జి డీఆర్వో రమేశ్, ఆర్డీవో వినోద్‌ కుమార్, ఇతర జిల్లా అధికారులు కలెక్టర్‌ను సన్మానించారు. కలెక్టరేట్‌ రక్షణ అధికారి ఏఎస్‌ఐ విఠల్, ఇతర పోలీసు సిబ్బంది పుష్పగుచ్ఛం అందజేశారు.

జేసీ రవీందర్‌ రెడ్డి అవార్డు ఫొటోను కలెక్టర్‌కు బహూరు. అనంతరం కలెక్టర్‌తో కేక్‌ను కట్‌ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో అవార్డును పొందడం సమష్టి విజయమని, అందరూ సహకరించడం వల్లే ఇది సాధ్యమైనందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. పేద కుటుంబాలకు ఎంత సేవ చేసినా తక్కువేనని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అన్నారని.. ఆయన మాటలను స్ఫూర్తిగా తీసుకుని జిల్లా యంత్రాంగం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ–నామ్‌ పటిష్ట అమలుకు కృషి చేసిన జేసీ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ మరి కొంత మంది అధికారులు ఎనలేని సేవలం దించారని, వారందరికీ అభినందనలు తెలిపారు. అధికారుల పోత్సాహం, మీడియా సహకారంతో ఈ–నామ్‌ రైతుల్లో ఆసక్తిని పెంచిందని తెలిపారు. అయితే ఈ అవార్డును జిల్లా రైతులకు అంకితం చేస్తున్నట్లు కలెక్టర్‌ ప్రకటించా రు.

ఈ అవార్డుకు సపోర్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీశ్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పూర్తి సహాయ సహకారాలు అందించారని చెప్పారు. జిల్లాలో రెండు పకడ గదుల నిర్మాణాలు, రానున్న హరితహారం కార్యక్రమంలో అందరూ సమష్టిగా పని చేసి జిల్లాకు అవార్డులు తెచ్చేందుకు కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో వెంకటేశ్వర్లు, డీఈవో రాజే శ్, జెడ్పీ సీఈవో గోవింద్, డీపీవో కృష్ణమూర్తి, ఉద్యాన శాఖ డీడీ సునంద, బీసీ సంక్షేమాధికారి విమలాదేవీ, డీఎంహెచ్‌వో సిరాజొద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులతో సంబరాలు
ఢిల్లీలో జాతీయ అవార్డును పొందిన అనంతరం జిల్లాకు వచ్చిన కలెక్టర్‌ యోగితా రాణా క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సంద ర్భంగా సోమవారం ఉదయాన్నే కుమారుడు కృష్ణ, కుమార్తె అముదాతో కలిసి కలెక్టర్‌ కేట్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం కుమారుడు, కుమార్తె ఇద్దరి కలిసి కలెక్టర్‌కు కేక్‌ తినిపించారు.

మరిన్ని వార్తలు